Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Agnipariksha season2  స్పిన్ ది గన్ టాస్క్‌లో ప్రియాంక స్పాంటేనిటి రామకృష్ణ ఔట్

Agnipariksha season2 స్పిన్ ది గన్ టాస్క్‌లో ప్రియాంక స్పాంటేనిటి రామకృష్ణ ఔట్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 15వ ఎపిసోడ్‌లో ఎల్లో కార్డ్ వచ్చిన వారికి జ్యూరీ చివరి అవకాశం ఇచ్చారు. ఫైర్ కార్డ్ ఉన్న శ్రష్టి ముందే సేవ్ అవ్వడంతో మిగిలిన వారికి బతికేందుకు టాస్క్ పెట్టారు.

గన్ తీసుకుని ఎదుటివారిని కాల్చి ఎందుకు కాల్చారో రీజన్ చెప్పాలనేది ఈ టాస్క్ రూల్. స్పిన్ ది గన్ అనే ఈ టాస్క్‌లో చివరికి రామకృష్ణ, ప్రియాంక మిగిలారు. బజర్ మోగిన వెంటనే ప్రియాంక చురుగ్గా గన్ అందుకుని రామకృష్ణపై షూట్ చేసింది. రామకృష్ణ మాత్రం అలాగే నిలబడిపోయాడు.

ఇదే పాయింట్‌పై జడ్జ్‌లు ప్రశ్నించారు. నువ్వు ఎందుకు గన్ తీసుకోలేదని జడ్జ్‌లు అడుగుతారు. చెప్పలేదు కదా అని రామకృష్ణ సమాధానమిచ్చాడు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ..

ఇందుకే నువ్వు అనర్హుడివి అని అంటుంది. జ్యూరీ కూడా ఇక్కడికి వచ్చాక కూడా ఒలిచినట్టు చెప్పరు.. అవకాశాన్ని క్షణాల్లో పట్టేయాలి, ప్రియాంకలా ఉండాలని అంటారు. దీంతో ప్రియాంక తన స్పాంటేనిటీతో సేవ్ అయిపోతుంది. చివరికి డేంజర్ జోన్‌లో రోహిత్, గాయత్రి, అపూర్వ, రామకృష్ణ నలుగురు మిగిలిపోయారు. ఈ నలుగురిలో నుంచే రేపు ఎలిమినేషన్ ఉండబోతుంది. Bigg Boss Agnipariksha 2 Episode 15, Yellow Card Task, Spin The Gun Task, Priyanka Spontaneity, Ramakrishna Eliminated, Danger Zone Contests

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One