సర్కార్ సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ ఐతే ఫుల్ ఎక్స్పీరియన్స్ మెమొరీ షేరింగ్ స్టోరీస్ తో నిండిపోయింది. "మీకు ఏదన్న హీరోతో జరిగిన మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా సరే చెప్పండి అని " సుధీర్ అడిగాడు.
"హీరోలందరితో నాకు మంచి మంచి ఎక్స్పీరిఎన్సెస్ ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి వస్తే ఒకసారి ఆయన మీ ఊరొస్తున్నానయ్యా సురేష్ అన్నారు. మా పాలకొల్లు వస్తున్నానని అన్నారు. ఓహ్ అవునా అండి.
దాంతో నేను మా ఇంటికి కూడా రండి అని సరదాగా అన్నాను. ఆ రోజు కరెక్ట్ గ వర్షం పడుతోంది. నేను కంగారు పడి రోడ్డు బాలేదండి అన్నాను. లేదు లేదు నేను మీ ఇంటికి వస్తున్నాని అని చెప్పి నడుచుకుంటూ 2 కిలోమీటర్లు మా ఇంటికి వచ్చారు.
పాలకొల్లు దాటాక వేడంగిపాలెం గ్రామం ఉంది . ఒక మాట చెప్తే అది ఎలా ఆచరించి చూపిస్తారో పెద్ద తరహా వాళ్ళు అనేది నేను ఆయన్ని చూసి షాకైపోయాను. ఆ విషయం నాకు ఇప్పటికీ మెమొరబుల్. ఆయన వచ్చేసరికి ఆ ఊరు మొత్తం మా ఇంటికి వచ్చేసింది ఆయన్ని చూడడానికి.
అలాగే నాగార్జున , చిరంజీవి గారితో బాగా క్లోజ్ గా ఉండేవాడిని. అలా ఇద్దరినీ కలిపి ఒక కవర్ పేజీ వేస్తె బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు నాగార్జున గారు నేను కలిసి కార్ లో వెళ్లి చిరంజీవి గారి ఇంటికి వెళ్లి చేసాం అది కవర్ పేజీగా వచ్చింది. అది ఇప్పటికీ మెమొరబుల్" అని చెప్పారు కొండేటి సురేష్.

