Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంబటి రాంబాబుకు జగన్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..!

అంబటి రాంబాబుకు జగన్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..!

హైదరాబాద్ అపోలోలో చికిత్స.. గుండెలో రెండు బ్లాకులు గుర్తింపు..! వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.

ఇటీవల అస్వస్థతకు గురైన అంబటి రాంబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ ఫోన్‌లో అంబటితో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసు కున్న జగన్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం చారు.

అంబటి రాంబాబు ఇటీవల అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరా బాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా గుండె రక్తనాళాల్లో రెండు బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించి, వైద్యుల సూచన మేరకు స్టెంట్ చికిత్స చేపట్టారు. స్టెంట్‌ చికిత్స విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం.

తన రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గుండెలో రెండు బ్లాకులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని అంబటి రాంబాబు స్వయంగా వెల్లడించారు. వెంటనే స్పందించిన వైద్య బృందం అవసరమైన చికిత్స అందించిందని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంబటి రాంబాబు అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

అయితే స్టెంట్ చికిత్స విజయవంతం కావడం, ఆరోగ్యం నిలకడగా ఉందన్న సమాచారం రావడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు. తనను పరామర్శించేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌కు రావొద్దని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, త్వరలోనే కోలుకుని గుంటూరుకు వస్తానని ఆయన తెలిపారు.

రెండు రోజుల్లో గుంటూరు వచ్చి అందరినీ కలుస్తానని పేర్కొన్నట్లు సమాచారం.. అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితిపై జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆరా తీయడం వైసీపీ వర్గాల్లో ప్రాధా న్యత సంతరించుకుంది. పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఆయన ఆరోగ్యంపై వివరాలు తెలుసుకుంటున్నారు. Jagan calls Ambati Rambabu, YS Jagan, Treatment at Apollo, Stent treatment, Angiogram, Ambati Rambabu ill, Telugu One, Telugu news

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One