Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో ఒక్క పన్ను పీకేస్తే రూ. 2.37 లక్షలు.. ఎన్నారై ఆవేదన..!

అమెరికాలో ఒక్క పన్ను పీకేస్తే రూ. 2.37 లక్షలు.. ఎన్నారై ఆవేదన..!

గ్రరాజ్యం అమెరికాలో నివాసం ఉండటం ఎంతో మంది కల. అధిక సంపాదన, మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయనేది ఎంత నిజమో.. అక్కడ వైద్య సేవలు పొందడం అత్యంత ఖరీదైన వ్యవహారమనేది అంతే యథార్థం.

తాజాగా ఓ ఎన్నారై తనకు ఎదురైన విస్తుపోయే అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఈ అంశం మరొకసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో గత 15 ఏళ్లుగా నివాసముంటున్న నితిన్ మల్హోత్రా అనే భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, అక్కడి దంత వైద్య ఖర్చులపై ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవల సాధారణ డెంటల్ చికిత్సలో భాగంగా ఒక పన్ను తొలగించుకోవడానికి ఆయన డెంటిస్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ వైద్యులు చెప్పిన అంచనా బిల్లు చూసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

కేవలం ఒక్క పన్నును తీసివేయడానికి ఏకంగా 2,500 డాలర్లు ఖర్చవుతుందని ఆ వైద్యుడు తెరిచి చెప్పారు. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 2.37 లక్షలు కావడం గమనార్హం. ప్రాథమిక దంత ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) సౌకర్యం ఉన్నప్పటికీ, ఇంత భారీ స్థాయిలో కొటేషన్ ఇవ్వడం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని నితిన్ పేర్కొన్నారు.

సాధారణంగా భారతదేశంలో ఇదే రకమైన దంత చికిత్స లేదా పన్ను తొలగింపు ప్రక్రియకు రూ. 15,000 నుండి రూ. 20,000 వరకు మాత్రమే ఖర్చవుతుందని ఆయన గుర్తు చేశారు. అమెరికాలో ఉండే ఎన్నారైలు ఎదుర్కొనే దాగున్న ఆర్థిక భారాలకు ఇటువంటి వైద్య ఖర్చులే నిదర్శనమని ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు.

ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వగానే నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. యుఎస్ఏలో సంపాదన అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ, వైద్య సంరక్షణ విషయంలో భారత్‌తో పోలిస్తే అక్కడ తీవ్రమైన వ్యయం అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అమెరికాలో సరైన దంత బీమా లేకపోతే సామాన్యులు కోలుకోవడం కష్టమని కామెంట్లు చేశారు. మరొక నెటిజన్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ..

భారత్‌లో రూట్ కెనాల్ చికిత్సకు 100 డాలర్ల కంటే తక్కువే ఖర్చయిందని, కానీ అమెరికాలో అదే చికిత్సకు ఏకంగా 3,500 డాలర్లు (రూ. 3 లక్షలకు పైగా) చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ టూరిజంలో భాగంగా భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఈ వ్యత్యాసాలే చెబుతున్నాయని విశ్లేషిస్తున్నారు. అమెరికాలో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ, ఇన్సూరెన్స్ పరిమితులు అపరిమిత సేవా రుసుముల కారణంగా సగటు పౌరుడికి వైద్యం భారం కాక తప్పడం లేదు. రాబోయే రోజుల్లో అక్కడ హెల్త్‌కేర్ సంస్కరణలు రాకపోతే, స్వదేశానికి వచ్చి చికిత్స చేయించుకునే ఎన్నారైల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. (USA Dental Treatment Cost Telugu, Nitin Malhotra Tooth Extraction Bill, NRI Life Expenses America, Medical Costs USA vs India, Dentist Bill USA, America Healthcare Expenses, US Dental Treatment Cost, Nitin Malhotra, Telugu One, Telugu news)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One