Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amitabh bachchan వైభవ్ సూర్యవంశీ ఆటపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ ట్వీట్

Amitabh bachchan వైభవ్ సూర్యవంశీ ఆటపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ ట్వీట్

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎనిమిది పదుల వయసులోనూ మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ ని ప్రదర్శిస్తూ వస్తున్నారు.

కల్కి 2 లో మరో సారి తన సత్తా చాటడానికి సిద్దమవుతున్న అమితాబ్ ఐ పి ఎల్ లో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరు చూసి చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో, అంతర్జాతీయ స్థాయి బౌలర్లని ఎదుర్కొంటూ భారీ ఇన్నింగ్స్ ఆడటంపై బిగ్ బి ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే అర్ధరాత్రి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వైభవ్‌ను ప్రశంసిస్తూ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను షేర్ చేశారు. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల అద్భుతమైన సూర్యుడు. ఆ వయసులో అయితే మాకు కనీసం గోళీలు, గల్లీ క్రికెట్ కూడా ఆడటం వచ్చేది కాదు.

అలాంటిది అతను అంతర్జాతీయ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతున్నాడు" అంటూ అమితాబ్ బచ్చన్ చాలా సరదాగా, అంతే గౌరవంగా రాసుకొచ్చారు. అమితాబ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Also read: Jayakrishna: తాత, తండ్రి, బాబాయ్ పేరు నిలబెడతాడా!.. శ్రీనివాస మంగాపురం ఏం చెప్పబోతోంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One