Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నాడీఎంకేతో పొత్తు లేదు...టీవీకే స్పష్టీకరణ

అన్నాడీఎంకేతో పొత్తు లేదు...టీవీకే స్పష్టీకరణ

మిళనాట 107 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ సారథ్యంలోని టీవీకే అధికార పగ్గాలు చేపట్టింది. మ్యాజిక్ ఫిగర్ 118కు 11 సీట్లు దూరంలో ఉండిపోయిన టీవీకేకి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు ప్రకటించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమమైందది.

అదే సమయంలో అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలు 25 మంది విజయ్‌కు జైకొట్టడంతో అధికార కూటమి బలం 144కి చేరింది. ఆ క్రమంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనే ఊహాగానాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం తోసిపుచ్చింది. తమ ప్రభుత్వానికి అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవని స్పష్టం చేసింది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వానికి మద్దతు కొనసాగించే విషయాన్ని పునరాలోచిస్తామంటూ సీపీఎం హెచ్చరికల నేపథ్యంలో టీవీకే తాజా వివరణ ఇచ్చింది.

సీపీఎం, వీసీకేతో సహా మూడు పార్టీలను ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆహ్వానించిన విషయాన్ని టీవీకే నేత, ప్రజాప్రనులు, క్రీడా శాఖ మంత్రి ఆధవ్ అర్జున గుర్తు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని, అన్నాడీఎంకే సపోర్ట్ తీసుకున్నా, అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగించాలనుకున్నా ప్రజా తీర్పును వమ్ము చేసినట్టేనని సీపీఎం అంటోంది. తమిళనాడు మరోసారి ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడం, గవర్నర్ పాలన ద్వారా బీజేపీ దొడ్డిదారిన తమిళనాడులో అడుగుపెట్టడం ఇష్టంలేకనే తాము టీవీకేకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారుజ కాగా, మంత్రివర్గం విస్తరణపై ఆధవ్ అర్జునను మీడియా ప్రశ్నించగా, త్వరలోనే దీనిపై టీవీకే బాస్ విజయ్ ఒక ప్రకటన చేస్తారని సమాధానమిచ్చారు. ఐదు సీట్లతో టీవీకే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్‌కు చోటు కల్పించే అవకాశాన్ని ఆయన ధృవీకరించారు.

ఇద్దరేసి ఎమ్మెల్యేలు కలిగిన సీపీఎం, వీసీకే, సీపీఐ, ఐయూఎంఎల్ పార్టీలు టీవీకే ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇస్తున్నాయి. ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆ పార్టీలను ముఖ్యమంత్రి పలుమార్లు ఆహ్వానించిట్టు ఆధవ్ అర్జున చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు టీవీకే భాగస్వామ్య పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని అన్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని అన్నాడీఎంకే పార్టీ బాస్ పళనిస్వామి నిర్ణయమే ఆ పార్టీ ఓటమికి కారణమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీఎంకేతో పొత్తుతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంపై అడిగినప్పుడు, డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం తప్పని అన్నాడీఎంకే క్యాడర్ గ్రహించినందునే వారు టీవీకేకు సపోర్ట్ చేశారని అన్నారు. అన్నాడీఎంకే రెబల్ వర్గం నేత సీవీ షణ్ముగం నాయకత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో టీవీకేకు మద్దతు ఇవ్వడంపై మాట్లాడుతూ, ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయించుకునే హక్కు ఎమ్మెల్యేలకు ఉంటుందని ఆధవ్ అర్జున చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One