Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అత్తాపూర్‌లో కిడ్నాప్ డ్రామా.చివరికి ట్విస్ట్!

అత్తాపూర్‌లో కిడ్నాప్ డ్రామా.చివరికి ట్విస్ట్!

త్తాపూర్ పరిధిలో నిన్న రాత్రి కలకలం రేపిన యువతి కిడ్నాప్ కేసు చివరికి ఊహించని మలుపు తిరిగింది. రాత్రి 10:55 గంటలకు డయల్ 100కి వచ్చిన ఫోన్ కాల్‌తో పోలీస్ వ్యవస్థ మొత్తం అప్రమత్తమైంది.

పిల్లర్ నెంబర్ 145 సమీపంలోని జాయ్ హాస్పిటల్ వద్ద తార్ వాహనంలో యువతిని కిడ్నాప్ చేశారని సమా చారం అందడంతో రాజేంద్ర నగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలు, ప్రాంతమంతా గాలింపు—అన్నీ వేగంగా కొనసాగాయి. కేసు నమోదు చేసి ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసి రాత్రంతా సోదాలు నిర్వహించారు. ఉదయాన్నే మళ్లీ పరుగులు పెట్టారు. ప్రతి క్లూ వెంబడి పరిగెత్తిన పోలీసులకు చివరికి ఆశ్చర్యకరమైన నిజం ఎదురైంది.

కిడ్నాప్ అయిందని భావించిన ఆ యువతి… తన సొంత ఇంట్లోనే ఉన్నట్లు బృందాలు గుర్తించారని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.. ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఎక్కడా కిడ్నాప్ జరగలేదని, బలవంతంగా ఎవరూ తీసుకెళ్లలేదని పోలీసులు స్పష్టం చేశారు. యువతికి ఎవరితోనూ ప్రేమ వ్యవహారం లేదని, ఈ ఘటనలో ఉన్న వారందరూ పరస్పరం తెలిసిన స్నేహితు లేనని తెలిపారు.

విదేశాల్లో పనిచేసి ఇటీవలే నగరానికి వచ్చిన ఈ యువతి విషయంలో ఇంకా పలు కోణా ల్లో విచారణ కొనసాగు తోందని డీసీపీ తెలిపారు. ప్రస్తుతం యువతి స్టేట్మెంట్ తీసుకుంటున్నారని, ఒకవేళ పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు... ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా… అత్తాపూర్ కిడ్నాప్ మిస్టరీ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One