Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్‌ ఫోక్సో కేసులో మైనర్‌గా బాధితురాలి నిర్ధారణ

బండి భగీరథ్‌ ఫోక్సో కేసులో మైనర్‌గా బాధితురాలి నిర్ధారణ

హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దర్యాప్తులో కీలక అంశమైన బాధితురాలి వయస్సుపై స్పష్టత రావడం కేసును మరింత సీరియస్ దశలోకి తీసుకెళ్లింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బాధితురాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు జనన ధృవీకరణ పత్రం సమర్పించింది. ఆ పత్రాన్ని ఆధారంగా తీసుకుని సంబంధిత సంవత్సరానికి చెందిన జీహెచ్‌ఎంసీ జనన రికార్డులను పరిశీలించగా, ఆమె మైనర్ అని నిర్ధార ణ అయ్యింది. ఈ నిర్ధారణ కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ వ్యవహారం న్యాయపరంగా కూడా వేడెక్కింది.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఫోక్సో కేసు ఆరోపణల నేపథ్యంలో తన పేరు, ఫోటోలు, వీడియోలు భవిష్యత్తులో ఉపయోగించ కుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల్లో తన పేరుతో ప్రచారంలో ఉన్న వీడియోలను తొలగిం చాలని కూడా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోర్టును కోరారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు..పోలీసుల దర్యాప్తు ఒక వైపు వేగంగా కొనసాగుతుండగా, మరోవైపు కోర్టు విచారణ ప్రారంభం కావడం కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.

రాజకీయ స్పందనలు, సోషల్ మీడియా చర్చలు, న్యాయ పరమైన పరిణామాలు... అన్ని కలిసి ఈ కేసును రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఇకపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది? కోర్టు నుంచి వచ్చే తదుపరి ఆదేశాలు ఏమిటి? అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One