బుల్లితెర మీద చాలా షోస్ పూర్తైపోయాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ మొదలుకావడానికి సిద్ధమైపోయింది. ఐతే గత సీజన్ నుంచి అంటే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి చూస్తే కామన్ పీపుల్ కోసం బిబి అగ్ని పరీక్షా పేరుతో ముందుగా ఫిల్టరేషన్ ప్రాసెస్ ఒక దాన్ని నడిపిస్తున్నారు.
అందులో ఫైనల్స్ కి వెళ్ళేవాళ్ళను మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 లేటెస్ట్ అప్ డేట్స్ ని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఇస్తున్నాడు. ఐతే కొత్త బిగ్ బాస్ సీజన్ కి "ప్లే లైక్ ఇంకాగ్నిటో" బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోందంటూ చెప్పుకొచ్చాడు. జూన్ మొదటి వారంలో అంటే జూన్ 7 లేదా 8 తేదీల్లో అగ్నిపరీక్ష 2 ప్రోమో రిలీజ్ కాబోతోంది అంటే బిగ్ బాస్ కి ఎలా అప్లై చేసుకోవాలనే రూల్స్ అందులో ఉండబోతున్నాయట.
ఇక లాస్ట్ సీజన్ లో కామన్ పీపుల్ ని చాలా మందిని సెలెక్ట్ చేశారు. ఇక సీజన్ 1 విన్నర్ గా శివ బాలాజీ, సీజన్ 2 లో కౌశల్ మందా, సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4 లో అభిజిత్, సీజన్ 5 లో విజె సన్నీ, సీజన్ 6 లో రేవంత్, సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్, సీజన్ 8 లో నిఖిల్ మలయక్కల్, సీజన్ 9 లో కళ్యాణ్ పడాల టైటిల్స్ ని గెలిచారు. ఈ 9 సీజన్స్ లో ఇద్దరు మాత్రమే కామన్ మ్యాన్ క్యాటిగరీలో వచ్చి టైటిల్ ని గెలుచుకున్నారు.

