Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్ ఇచ్చిన వరాలు ఇవే

బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్ ఇచ్చిన వరాలు ఇవే

తెలుగు సినిమాకి దొరికిన మరో అరుదైన హీరోలో సంజోష్ ఒకరు. లెజండ్రీ యాక్టర్ రాజేంద్రప్రసాద్ తో కలిసి 'బేవర్స్' మూవీతో అడుగుపెట్టిన సంజోష్ స్క్రీన్ పైనే కాదు, నిజ జీవితంలోను హీరో అనిపించుకుంటున్నాడు.

ఈ రోజు రాఖి పొర్ణమి సందర్భంగా హైదరాబాద్ నాగోల్ లోని 'శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్‌కి; చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే గ్యాస్ స్టవ్‌ను బహూకరించి, అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళతో సంజోష్ మాట్లాడుతు 'ఇకపై మీరందరూ నా చెల్లెళ్లే. మీకు ఏ అవసరం వచ్చినా నా వంతు అండగా ఉంటాను' అంటూ వారికి మాట ఇచ్చారు.

సంజోష్ ఇప్పటికే శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిల కోసం రెండు సార్లు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఫ్రిజ్ డొనేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. Also read: Toxic: సెకండ్ డే షాకింగ్ కలెక్షన్స్.. ఒక్క రోజులోనే రివర్స్ గేర్! ఇది మాత్రమే కాదు, ఇప్పటివరకు 250 మందికి మొబైల్ ఐ క్యాంప్స్ ద్వారా క్యాటరాక్ట్ సర్జరీలు, 118 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించాడు. అలాగే కొంత మంది విద్యార్థుల చదువు బాధ్యతని తీసుకొని హీరో కట్ అవుట్ రేంజ్ ని పెంచాడు. మరి వరంగల్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో మంచి ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే… తన వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో సేవా కార్యక్రమాలు చేస్తున్న హీరో సంజోష్‌ని అభినందిద్దాం. Sanjosh, Sri Maatha Blind Foundation, Rajendraprasad, TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood, Tollywood News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One