Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brahmamudi  50 వేల కోచింగ్ ఫీజు కోసం రాజు ఆరాటం  వరలక్ష్మీ వ్రతంతో ఇందుని ఇరికించిన ఐశ్వర్య

Brahmamudi 50 వేల కోచింగ్ ఫీజు కోసం రాజు ఆరాటం వరలక్ష్మీ వ్రతంతో ఇందుని ఇరికించిన ఐశ్వర్య

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 1122 లో.....రాజు ఇంటికి వచ్చి అమ్మ చేతి వంట తింటుంటే వెంకీ గురించి మాట్లాడతాడు చలపతి.

వాడు మంచోడు.. తెలివైనోడు.. బాగా చదువుకున్నాడు.. ఏదో ఒక జాబ్ వచ్చి సెటిల్ అవుతాడని రాజు అంటాడు.

అయితే సెటిల్ అవ్వాలంటే నువ్వే హెల్ప్ చేయాలిరా అని చలపతి అడిగితే, AI క్లాసులు నేను చెప్పాలా నాకు రాదని రాజు కామెడీ చేస్తాడు. దానికి చలపతి ఒక సెంటర్ ఉంది.. 50 వేలు కడితే ట్రైనింగ్ తో పాటు జాబ్ కూడా ఇస్తారంట అని చెప్పడంతో రాజు షాక్ అవుతాడు. అప్పు తీసుకొస్తాన్న చలపతిని వద్దు నేనే ట్రై చేస్తా అని రాజు ఆపుతాడు.

ఒకప్పుడు అప్పు తీసుకో అనేవాడివి ఇప్పుడు వద్దంటున్నావ్,.. చాలా మారిపోయావ్ రా అని చలపతి అంటాడు. నమ్మలేని నిజాలు అంటే ఇవే నాన్న అని రాజు అంటాడు. తర్వాత వెంకీ దగ్గరికి వెళ్లి రాజు ఎమోషనల్ అవుతాడు.

ఏంట్రా అలా ఉన్నావ్.. అమ్మాయిని పోగొట్టుకున్నట్టు.. జీవితమే పోయినట్టు ఉంటున్నావ్.. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది కదరా..

మేమంతా ఉన్నాం కదరా అని రాజు ధైర్యం చెప్తాడు. వెంకీ మౌనంగా ఉంటాడు. నీకు జాబ్ కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా..నాతో చెప్పురా.. నువ్వు దూరంగా ఉన్నా నా గుండెల్లోనే ఉంటావ్..

కలిసి పెరిగాం.. కష్టాల్ని పంచుకున్నాం కదరా అని రాజు అంటాడు. కానీ వెంకీ ఏం లేదన్నయ్యా అని దాటేస్తాడు. సరే కోచింగ్ డబ్బు నేను చూస్తా అని రాజు మాట ఇస్తాడు.

మరోవైపు ఇంట్లో శేషు భ్రమరాంబకి వినిపించేలా వరలక్ష్మీ వ్రతం రీల్స్ పెడతాడు. ఏంటి నీ బాధ అంటుంది. నువ్వు నా కోసం వ్రతం చేయట్లేదని బాధ అని శేషు అంటాడు. ఎప్పుడూ తినడం తప్ప భర్త గురించి ఆలోచించవని భ్రమరాంబని శేషు తిడతాడు.

ఇంతలో రేఖ, ఐశ్వర్య వస్తారు. భ్రమరం, రేఖ ఇద్దరిని కలిపి తిడతాడు శేషు. దాంతో సరే మనం కూడా చేద్దామని భ్రమరం, రేఖ ఒప్పుకుంటారు. అప్పుడే ఐశ్వర్య తన కుట్ర మొదలుపెడుతుంది, మీరు మాత్రమే చేసుకుంటారా..

కొత్త జంట గురించి పట్టించుకోరా అని ఇందుని ఇరికిస్తుంది. అపర్ణకి ఐశ్వర్య కావాలనే ఇలా చేస్తోందని అర్థమవుతుంది. అయినా భ్రమరం ఇందుని పిలిచి నువ్వు కూడా చేస్తావా అంటుంది. ఐశ్వర్య ప్లాన్ అర్థం చేసుకున్న ఇందు కూడా చేస్తానని చెప్తుంది.

నీ భర్తతో కలిసి చేయాలని ఐశ్వర్య అంటే.. నా భర్తతో కలిసే చేస్తానని ఇందు ధైర్యంగా అంటుంది. రేపు ఏదో కారణం చెప్పి వ్రతం చేయకుండా వెళ్లిపోతారు చూడండి అని ఐశ్వర్య అందరి ముందు అంటుంది. భ్రమరం, రేఖ, శేషు ఆమెని తిడతారు.

చివర్లో అపర్ణ ఇందుతో, మీరు నిజమైన భార్యాభర్తలు కాదు కదా, అమ్మవారితో పరాచకాలు వద్దు అంటే, నా మనసు బావతో ముడిపడింది.. బావని భర్తగా ఫీల్ అవుతున్నాను పెళ్లి కాని వాళ్లు కూడా మంచి మొగుడు కోసం వ్రతం చేస్తారు కదా.. నేను కూడా అలానే చేస్తా.. బావని నేను ఒప్పిస్తానని ఇందు అంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One