Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brahmamudi  ఐశ్వర్య చేసిన మోసాన్ని చెప్పేసిన శృతి ఇందు ఏం చేయనుంది!

Brahmamudi ఐశ్వర్య చేసిన మోసాన్ని చెప్పేసిన శృతి ఇందు ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 1168 లో టెండర్ ఫైట్ పీక్స్ కి చేరింది. తనకు టెండర్ వస్తుందని ఐశ్వర్య బిల్డప్ కొడుతుంటే, దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం టెన్షన్ లో ఉంది.

టెండర్ ఎవరికి వచ్చిందో తెలియక అంతా ఎదురుచూస్తుండగా ఇందు స్వీట్స్ పట్టుకుని వస్తుంది. మళ్లీ ఇందుకే వచ్చిందా అని రేఖ బ్యాచ్ షాక్ అవుతుంటే లేదు ఈసారి కాంట్రాక్ట్ నీకే వచ్చింది అంటూ ఐశ్వర్యకు చెప్పి ఐశ్వర్యను సంతోషపెడుతుంది ఇందు. ఎవరికి వచ్చినా మన ఇంట్లో వాళ్లకే కదా వచ్చిందని ఇందు అంటే, మీ ఓటమిని జీర్ణించుకోలేక నా గెలుపుని కవర్ చేసుకుంటున్నావంటూ ఇందు మంచితనాన్ని ఐశ్వర్య కూడా అవమానిస్తుంది. అసలు గొడవ అక్కడేం మొదలవుతుంది.

నిన్ను నా ఫ్యామిలీ అనుకున్నాను. నీ గెలుపుని నా గెలుపు అనుకున్నానని అంటుంది ఇందు. దానికి తోడు అపర్ణ కూడా ఇందు చేసిన త్యాగాల వల్లే మనం ఇలా ఉన్నామని సపోర్ట్ చేస్తుంది. కానీ ఐశ్వర్య ఏమాత్రం తగ్గకుండా మన ఛాలెంజ్ లో నేనే గెలిచాను..

ఇప్పుడు చెక్ పవర్ తో పాటు కంపెనీ పవర్స్ అన్నీ నాకే ఇస్తూ సంతకం చేయమంటూ ఇందుని డిమాండ్ చేస్తుంది. అందరూ షాక్ అవుతుంటే ఇందు మాత్రం సెకను కూడా ఆలోచించకుండా సంతకం చేసి ఇచ్చేస్తుంది. నువ్వు ఏమైనా చేసుకో కానీ దుగ్గిరాల కుటుంబ పరువు మాత్రం తీయొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ అపర్ణ కూడా ఫైర్ అవుతుంది.

ఇక అసలు ట్విస్ట్ అర్ధరాత్రి బయటపడుతుంది. ఇందుకి శృతి ఫోన్ చేసి ఐశ్వర్య చేసిన మోసాన్ని బయటపెడుతుంది. ఎప్పుడూ స్వరాజ్ గ్రూప్ కే వచ్చే టెండర్ ఈసారి ఐశ్వర్యకి ఎలా వెళ్లిందని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఫినిష్ చేయడానికి 5 కోట్లు అయ్యే పనిని ఐశ్వర్య కోటి రూపాయల లాస్ కి కోట్ చేసిందని..

ఎలాంటి ప్రాఫిట్ చూసుకోకుండా కావాలనే తక్కువకు కొట్టేసిందని చెప్పడంతో ఇందు షాక్ అవుతుంది. ఆఫీసుకి ఎవరెవరో వచ్చి పోతున్నారని, జాగ్రత్త పడకపోతే పెద్ద ప్రాబ్లమ్ వస్తుందని శృతి హెచ్చరిస్తుంది. మరోవైపు కిచెన్ లో లక్కీ కోసం పీతల కూర వండలేదని పనిమనిషిపై రేఖ, అపర్ణపై ఫైర్ అవుతుంది. రాజ్ కౌంటర్ ఇవ్వడంతో నువ్వు బస్తీలో పెరిగిన ఆఫ్ట్రాల్ గాడివి, ఇందుని పెళ్లి చేసుకోకుంటే వాచ్ మెన్ గా కూడా పనికిరావంటూ రేఖ నోరు జారుతుంది.

లాస్ట్ కి డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ మరింత పెద్దదవుతుంది. అసలు వీడి కాలిగోటికి కూడా సరిపోవంటూ లక్కీ గురించి అపర్ణ నిజం చెప్పబోతుంటే ఇందు వచ్చి ఆపుతుంది. వెంటనే ఐశ్వర్యని నిలదీస్తుంది. ఆ టెండర్ ఎలా పూర్తి చేస్తావ్..

నీకు నష్టం వస్తుంది.. క్వాలిటీ మెయింటైన్ చేయలేవంటూ ఫైర్ అవుతుంది. నా కంపెనీ నిర్ణయాలు నావే.. నువ్వు జోక్యం చేసుకోవద్దంటూ ఐశ్వర్య వార్నింగ్ ఇస్తుంది.

అదే టైమ్ లో డైనింగ్ టేబుల్ మీద లక్కీని తన భర్త అని, రేఖ ఆంటీ కొడుకు అని ఓన్ చేసుకున్నట్టు నటిస్తుంది. దానికి పొంగిపోయిన లక్కీ బెడ్ రూమ్ మొత్తం పూలతో అలంకరిస్తాడు. కానీ ఐశ్వర్య వచ్చి నీ వల్ల నా కడుపులో పెరుగుతున్న బేబీని వేస్ట్ గా ఫీలవుతున్నాను..వాళ్ల మీద గెలవడానికి నువ్వు నాకు కారణం కావాలి అందుకే అలా చేశాను.. ఇక నుంచి కింద పడుకోమంటూ లక్కీని అవమానిస్తుంది. చివర్లో స్వరాజ్ గ్రూప్ కి వెళ్లే ప్రతీ టెండర్ ని తనే లాగేసుకుని ఆ కంపెనీని దివాళా తీయిస్తానని ఐశ్వర్య రేఖతో చెప్పడంతో దీని స్పీడ్ కి బ్రేకులు ఎలా వేయాలో నాకు తెలుసంటూ రేఖ రగిలిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One