స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1103 లో.... రాజు పూజకి రాలేదని ఇందు అలుగుతుంది.
రాజుతో మాట్లాడదు. దాంతో రాజు తనని బుజ్జగిస్తాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ పాట పాడుతాడు. అయినా ఇందు అలాగే ఉంటుంది.
ఆకలిగా ఉంది ప్లీజ్ భోజనం పెట్టమని రాజు అనగానే అవసరం లేదు.. నేను నీ కోసం వంట చెయ్యలేదని ఇందు అంటుంది. నేను చెప్పినట్లు నువ్వు విననప్పుడు.. నీ మాట నేను ఎందుకు వినాలి..
అందుకే చెయ్యలేదని ఇందు అంటుంది. నువ్వే నీకు కావల్సింది చేసుకొని తినమని ఇందు అనగానే నాకు ఏమైనా వంట రాదని అనుకుంటున్నావా చేస్తానని రాజు కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తూ చెయ్ కాల్చుకుంటాడు. అప్పుడే అపర్ణ వచ్చి అయ్యో బాబు ఏమైంది అంటూ వెన్నె రాస్తుంది. నీకెందుకు బాబు ఇదంతా కష్టం..
నేను నీ కోసం బిర్యానీ చేసానని అపర్ణ అనగానే థాంక్స్ అమ్మమ్మ అని రాజు అంటాడు రాజుకి అపర్ణ ప్రేమగా వడ్డిస్తుంది. అపర్ణ ఎమోషనల్ అవుతుంటే అమ్మమ్మ ఎందుకు బాధపడుతుందో నాకు తెలుసు నేను పూజకి రాలేదని బాధపడుతుందని అనుకుంటాడు. అమ్మమ్మ నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానని రాజు అనగానే సరే అని అపర్ణ అంటుంది. మరొకవైపు ఇందు దగ్గరికి ఐశ్వర్య వచ్చి నాకు కొంచెం డబ్బు కావాలని అడుగుతుంది.
ఎందుకో చెప్పు ఇస్తానని ఇందు అంటుంది. నేను చెప్పనని ఐశ్వర్య అనగానే నేను ఇవ్వనని ఇందు అంటుంది. దాంతో ఇందుపై ఐశ్వర్య కోప్పడుతుంది. మరొకవైపు నందు ఫోన్ చేస్తుంటే వెంకీ ఫోన్ కట్ చేస్తాడు.
అప్పుడే నందు ఎదురువస్తుంది. రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎందుకు కట్ చేస్తున్నావని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

