Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చాలామంది పేదవాళ్లుగానే ఉండిపోవడానికి అసలు కారణాలు ఇవే..!

చాలామంది పేదవాళ్లుగానే ఉండిపోవడానికి అసలు కారణాలు ఇవే..!

భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ. పేదవారిలో కూడా చాలా పేదవారు, ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే వారు ఎంతో మంది ఉన్నారు.

సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి. అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది.

మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే.. టీవి, పోన్.. చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది. టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి.

టీవిలో ఛానెల్స్ కానీ, స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు. పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది. జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి, స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు. అలవాట్లు, అభిరుచులు..

ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు, అభిరుచులు ఉండవు. అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు.

లక్ష్యాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం, జ్ఞానాన్ని ఆర్జించడం, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి.

కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది. కంఫర్ట్ జోన్.. చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం. ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు.

ఉన్న సంతోషం, ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు. కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు. అదృష్టం..

ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ, గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు.

ఇతరులను నిందించడం.. నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద ఉద్యగం తెచ్చుకునేవాడిని, నాకు బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు. తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు.

పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు. *రూపశ్రీ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One