Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chiranjeevi ఫ్యాన్స్ కి మే 21 న గుడ్ న్యూస్

Chiranjeevi ఫ్యాన్స్ కి మే 21 న గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)'మన శంకరవరప్రసాద్‌గారు'ని మించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు మళ్లీ సిద్దమవుతున్నాడు. తన 158 వ చిత్రాన్ని వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ(Bobby)దర్వకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

మెగా 158' ముహూర్తపు వేడుకలకి అధికారికంగా తేదీ ఖరారైంది. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం అప్‌డేట్‌ని స్వయంగా పంచుకున్నారు. మే 21వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రకటనతో పాటు చిరు షేర్ చేసిన ప్రత్యేక జిమ్ వర్కౌట్ వీడియో ఇప్పుడు నెట్టింటిని ఊపేస్తోంది.

ఇటీవల మోకాలి గాయం, ఆ తర్వాత చిన్న భుజం ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ, చిరంజీవి తన 70 ఏళ్ల వయసులో చూపిస్తున్న ఎనర్జీ డెడికేషన్ చూస్తే తన మొదటి సినిమాలాగానే బాబీ మూవీ అనిపిస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరు రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లలో కనిపించబోతున్నట్లు సమాచారం. 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్‌ని షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్‌తో, అంతకు మించిన పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ రెండో సినిమా రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై జనగణమన ఫేమ్ వెంకట్ కే నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సంస్థ టాలీవుడ్‌లోకి నేరుగా అడుగుపెడుతున్న మొదటి సినిమా ఇదే. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్' అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వస్తుండగా రాబోయే 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ తో పాటు మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One