సర్కార్ సీజన్ 6 ప్రతీ వారం ఎపిసోడ్ లో మంచి పవర్ ఫుల్ గెస్టులు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసి వెళ్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి ఫన్ గా సాగింది.
ఐతే అందులో హోస్ట్ సుధీర్ ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పాడు. విష్ణుప్రియ అడిగింది "మీ హీరోయిన్ క్రష్ ఎవరు" అని. వెంటనే సుధీర్ నాకు ఓన్లీ క్రష్ ఉంది ముగ్గురి మీదే..మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. "నేను ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇంటి గృహప్రవేశానికి ఇన్వైట్ చేయడానికి మా తమ్ముడిని తీసుకుని చిరంజీవి గారి ఇంటికి వెళ్లాను.
ఆయన అప్పుడు టీ తాగుతావా అని అడిగారు. నాకు అలవాటు లేదు అని చెప్పాను. వెంటనే పాలు తెప్పించారు. తాగు అన్నారు.
తీసుకుని తాగాను. ఈలోపు ఫోన్ లో ఏదో మాట్లాడారు. అంతా ఐపోయింది. నేను మా తమ్ముడు సర్ ఇంకా వెళ్తాం అన్నాము.
ఒక్క నిమిషం ఉండండి అన్నారు. ఈలోపు ఒక పెద్ద పార్సెల్ వచ్చింది. నాకు ఒక గిఫ్ట్ అలాగే మా అమ్మ నాన్నకు బట్టలు పెట్టారు. ఇంకా మా తమ్ముడు ఏడుపు స్టార్ట్ చేసాడు.
వాడికి ఏమీ అర్ధం కావట్లేదు. చిరంజీవి గారి ఇంటికి వెళ్లడం ఏంటి ఆయన పాలు ఇవ్వడం ఏమిటి బట్టలు పెట్టడం ఏమిటి అని. అప్పుడు చిరంజీవి గారు చెప్పారు సుధీర్ మీ ఇంటి గృహప్రవేశ సమయంలో నేను ఇండియాలో ఉండట్లేదు. కానీ కచ్చితంగా ఇంటికైతే ఒకసారి వస్తాను అన్నారు. ఇక మేమంతా కూడా చిరంజీవి గారు మా ఇంటికి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాం.

