Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరంజీవి లెటర్ రాసేసరికి ఇండస్ట్రీలో నా పేరు మోతమోగింది!

చిరంజీవి లెటర్ రాసేసరికి ఇండస్ట్రీలో నా పేరు మోతమోగింది!

ర్కార్ సీజన్ లో లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే వామ్మో అనకుండా వుండరు ఎందుకంటే టాప్ మోస్ట్ క్రిటిక్స్ వచ్చారు. అందులో ఫేమస్ ఐన ప్రభు కూడా ఉన్నారు. "అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చి అగ్ర జర్నలిస్ట్ గా నిలిచారు.

ఆయన ఎంత జర్నలిస్ట్ అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ ఏంటంటే జీవితంలో రాసిన మొట్టమొదటి ఆర్టికల్ ని చదివి చిరంజీవి గారు ఆయనకు రిటర్న్ లెటర్ రాశారు" అంటూ సుధీర్ ప్రభు గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఆయన తన జర్నీ గురించి చెప్పారు. ఇక రాగానే సుధీర్ ఆయనకు విషెస్ చెప్పాడు గద్దర్ అవార్డు తీసుకున్నందుకు. "ఇండస్ట్రీలో ప్రభు గారు అంటే దాసరి గారు దాసరి గారు అంటే ప్రభు గారు అంటారు.

"ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయింది సర్" అని సుధీర్ అడిగాడు. "40 ఇయర్స్ ఇండస్ట్రీ " అని చెప్పారు. దాంతో సుధీర్ మీకెన్నేళ్లు సర్ అని అడిగితే చెప్పను అన్నారు. "చిరంజీవి గారు మీకు లెటర్ రాశారు అంటారు అదేంటి " అని అడిగాడు సుధీర్.

"నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా రెండేళ్లు చేసిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందని తెలిసి దాసరి నారాయణ రావు గారిని అడగడం ఆయన నాకు వెంటనే అప్పాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. జాయిన్ ఐన రెండో నెల్లోనే చిరంజీవి గారి పుట్టినరోజు. ఆర్టికల్స్ రాయమన్నారు.

అప్పుడు రెండు ఆర్టికల్స్ రాసాను ఉదయం వీక్లీకి , శివరంజని మ్యాగజైన్ కి. ప్రింట్ అయ్యి మార్కెట్ లోకి వెళ్లిన మూడో రోజున మద్రాస్ నుంచి ఫోన్ . ఈ ప్రభు ఎవరు నాకు ఇతని అడ్రస్ కావాలి అని చిరంజీవి గారి దగ్గర నుంచి మెసేజ్ వస్తే నేను నా అడ్రస్ పంపించాను. ఆ తరువాత మూడవ రోజున ఆయన దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చింది.

నేనెవరో తెలీదు నా పరిచయం లేదు. కేవలం నేను రాసిన రెండు ఆర్టికల్స్ చదివి చాల అద్భుతంగా రాసావ్ నా గురించి రాశావని కాదు నువ్వు రాసిన విధానం నచ్చింది. నువ్వు చాలా పెద్ద జర్నలిస్ట్ అవుతావు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలవు అని లెటర్ రాశారు. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రత్యేకంగా లెటర్ రాశారంట అంటూ నా పేరు మారుమోగిపోయింది." అంటూ చెప్పారు. ఇక తర్వాత సుధీర్ స్టైల్ కళ్ళజోడు పెట్టుకుని ఎంటర్టైన్ చేశారు జర్నలిస్ట్ ప్రభు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One