Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరంజీవి నాగార్జున మల్టీస్టారర్ అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్

చిరంజీవి నాగార్జున మల్టీస్టారర్ అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్

టాలీవుడ్‌ ఫోర్ పిల్లర్స్ లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బాండింగ్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఓ రకంగా బ్రదర్స్ లా ఉంటారు.

వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే చూడాలనేది.. అభిమానులు దశాబ్దాల కల. ఇప్పుడు ఆ కలను నిజం చేసే బాధ్యతను డైరెక్టర్ అనిల్ రావిపూడి తన భుజాలపై వేసుకున్నారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. నలుగురు సీనియర్ స్టార్స్ లో నాగార్జునతో తప్ప మిగతా ముగ్గురు స్టార్స్ తో రావిపూడి సినిమాలు చేశారు.

చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు', బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' చేశారు. ఇక వెంకటేష్ అయితే 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' చేశారు. అలాగే 'మన శంకర వరప్రసాద్ గారు'లోనూ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేయడం విశేషం. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో మరో మల్టీస్టారర్ చేస్తున్నారు రావిపూడి.

అయితే నాగార్జునతో సినిమా చేస్తే.. నలుగురు స్టార్స్ తో సినిమాలు చేసిన డైరెక్టర్ గా అరుదైన ఘనత సాధించే అవకాశం అనిల్ రావిపూడికి ఉంటుంది. రావిపూడి సైతం ఇదే విషయాన్ని చెబుతూ.. నాగ్ తో సినిమా చేయాలని ఉందనే విషయాన్ని ఇప్పటికే బయటపెట్టారు.

ఈ క్రమంలోనే నాగార్జునతో సినిమా ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి.. సోలోగా కాకుండా, చిరంజీవితో మల్టీస్టారర్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ పట్టాలెక్కితే.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం. Anil Ravipudi, Chiranjeevi, Nagarjuna, Multistarrer

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One