Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిట్టీల వ్యాపారి 5 కోట్లకు కుచ్చుటోపీ..14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..!

చిట్టీల వ్యాపారి 5 కోట్లకు కుచ్చుటోపీ..14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..!

చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కం 10వ అదనపు మెట్రోపా లిటన్ మేజిస్ట్రేట్ ఎదుట నిందితుడిని హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిం చారు. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి కేంద్ర కారాగా రానికి తరలిం చారు. పోలీసులు హౌసింగ్ బోర్డుకు చెందిన నల్ల రమేష్ (62) ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా పనిచేస్తూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సాకేత్‌కు చెందిన ఏ.

వెంకటేశ్వర్లు నల్ల రమేష్ వద్ద రూ.10 లక్షల చిట్టీ వేశారు. సుమారు 25 నెలల పాటు క్రమం తప్ప కుండా చిట్టీ డబ్బులు చెల్లించారు. చిట్టీ గడువు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర్లుకు రావాల్సిన రూ.20 లక్షలకు సంబం ధించి రమేష్ చెక్కు ఇచ్చాడు.అయితే ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా బౌన్స్ కావడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని పలు మార్లు కోరినా నల్ల రమేష్ నుంచి స్పందన లేకపోవ డంతో, నెలలు గడిచినా తనకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవ డంతో వెంకటేశ్వర్లు గత జూలై 7న జవహర్‌నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నల్ల రమేష్ వద్ద చిట్టీలు వేసిన మరికొందరు కూడా డబ్బులు కోల్పోయినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. బాధితుల సంఖ్య సుమారు 25 మందికి చేరడంతో పాటు, మొత్తం వ్యవహారం దాదాపు రూ.5 కోట్ల మేరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.దర్యాప్తులో భాగంగా నల్ల రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 27న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం రమేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నిందితుడిపై మరిన్ని ఫిర్యాదులు, కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One