Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దశాబ్దాల నాటి చిరురాజ్‌కుమార్ క్లాసిక్ మూమెంట్‌ను గుర్తుచేసిన చరణ్ శివరాజ్‌కుమార్‌

దశాబ్దాల నాటి చిరురాజ్‌కుమార్ క్లాసిక్ మూమెంట్‌ను గుర్తుచేసిన చరణ్ శివరాజ్‌కుమార్‌

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, కన్నడ సెన్సేషన్ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ల మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు స్టార్స్ కలయికలో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది'.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్‌ల కాలం నాటి ఒక అద్భుతమైన ఐకానిక్ క్షణాన్ని వీరి వారసులు రీక్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బెంగళూరు వేదికగా జరిగిన ప్రెస్ మీట్ అనంతరం రామ్ చరణ్, శివరాజ్ కుమార్, కథానాయిక జాన్వీ కపూర్ కలిసి ఒక ప్రత్యేకమైన చిట్‌చాట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సాగుతున్న సమయంలో యాంకర్ అప్పట్లో చిరంజీవి, రాజ్‌కుమార్‌లకు సంబంధించిన ఒక అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను స్క్రీన్‌పై చూపించారు.

ఆ కాలంలో శ్రీ వజ్రేశ్వరీ కంబైన్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా రాజ్‌కుమార్ ఎంతో ప్రేమతో చిరును ముద్దాడిన ఆ క్షణం అప్పట్లో సరిగ్గా కెమెరాకు చిక్కలేదని యాంకర్ గుర్తుచేశారు. అలాంటి ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఇప్పుడు మీ ఇద్దరూ లైవ్‌లో చేసి చూపిస్తే చూడాలని ఉందని యాంకర్ కోరారు. దాంతో ఏమాత్రం తడుముకోకుండా శివన్న వెంటనే రామ్ చరణ్‌ను ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని, గట్టిగా హగ్ చేసుకుని ఆయన బుగ్గపై ముద్దు పెట్టారు. చరణ్ కూడా శివన్న చూపించిన ప్రేమాభిమానాలకు మురిసిపోయారు.

దశాబ్దాల నాటి పెద్దల బంధాన్ని, నేటి తరం వారసులు ఇలా కళ్లకు కట్టినట్లు రీక్రియేట్ చేయడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి మరియు రాజ్‌కుమార్ కుటుంబాల మధ్య గత ఎన్నో ఏళ్లుగా విడదీయరాని అనుబంధం కొనసాగుతోంది. పెద్దల కాలం నాటి ఆ స్నేహం, ఆప్యాయతలు నేటికీ చెక్కుచెదరకుండా తదుపరి తరానికి కూడా బదిలీ అయ్యాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆ నాడు ఆ దిగ్గజాలు వెండితెరపై కలిసి నటించకపోయినప్పటికీ..

ఇప్పుడు వారి వారసులు రామ్ చరణ్, శివరాజ్ కుమార్ కలిసి 'పెద్ది' చిత్రం ద్వారా స్క్రీన్‌ను పంచుకోవడం మెగా అండ్ కన్నడ అభిమానులకు కనులవిందుగా మారింది. ఈ అరుదైన వీడియో క్లిప్ మరియు ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్ర్రెండ్ అవుతున్నాయి. ఇరు ఇండస్ట్రీలకు చెందిన అభిమానులు ఈ విజువల్స్ చూసి మురిసిపోతున్నారు. "రియల్ బాండింగ్ అంటే ఇదే..

పెద్దల వారసత్వాన్ని, గౌరవాన్ని ఇద్దరు హీరోలు అద్భుతంగా కాపాడుతున్నారు" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం 'పెద్ది' చిత్రంపై ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ నటన, శివరాజ్ కుమార్ పోషించిన పవర్‌ఫుల్ పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్, సాంగ్స్ మరియు ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One