Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దీపికా పదుకునే కలకలం ఆ పాన్ ఇండియా హీరో కంటే నేనే తోపు

దీపికా పదుకునే కలకలం ఆ పాన్ ఇండియా హీరో కంటే నేనే తోపు

ఇండియా వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులని సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో దీపికా పదుకునే ఒకరు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో 'రాకా' చేస్తుంది.

దీపికా అనౌన్స్ వీడియోతో రాకా మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోతో అయితే దీపికా ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతుందనే విషయం తెలుస్తుంది. దీపికా రీసెంట్ గా ఒక ఈవెంట్ లో మాట్లాడుతు 'ఈమధ్యనే ఒక పెద్ద హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రెమ్యూనరేషన్ నా రేంజ్ కి తగ్గ అడిగాను. ఆ హీరో కంటే నా ట్రాక్ రికార్డు గొప్పది, బ్రాండ్ పెద్దది కాబట్టే డిమాండ్ చేశాను.

కానీ ఆ హీరో కి ఇంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాము, మీకు ఇంత మాత్రమే ఇవ్వగలం అని చెప్పారు. అయితే నాకు వర్కౌట్ అవ్వదు లేండి అని చెప్పి తప్పుకున్నాను' అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. Also Read: శ్రీ పట్టాభిరామచంద్రస్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో దిల్ రాజు..

హాజరైన హీరో ఎవరో తెలుసా! ఎందుకంటే దీపికాని ప్రభాస్ స్పిరిట్ నుంచి ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొన్ని కారణాల వల్ల తప్పించాడు. దీంతో దీపికా మాట్లాడింది స్పిరిట్ గురించే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పాన్ ఇండియా కట్ అవుట్ ప్రభాస్ కి ఉన్న రేంజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు 100 కోట్లు రాబట్టే కెపాసిటీ ప్రభాస్ సొంతం. Deepika Padukone, Prabhas, Spirit, TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood, Tollywood News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One