Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dragon డ్రాగన్ గ్లింప్స్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్

Dragon డ్రాగన్ గ్లింప్స్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో డ్రాగన్(Dragon)నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. . సుమారు నాలుగు నిమిషాల నిడివితో ఉండగా డ్రాగన్ గా ఎన్టీఆర్ విశ్వరూపాన్ని మరో సారి చూడబోతున్నామని స్పషంగా తెలియచేస్తుంది.

ఫ్యాన్స్ అయితే గ్లింప్స్ అనే పేరేగాని ఫుల్ మీల్స్ పెట్టిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ప్రశాంత్ నీల్ గ్లింప్స్ తోనే డ్రాగన్ కథతో పాటు క్యారెక్టర్స్ యొక్క లక్ష్యాన్ని చెప్పేసాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు డ్రాగన్ గ్లింప్స్ పై స్పందిస్తు గ్లింప్స్ ఒక రేంజ్ లో ఉంది. ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం.

ముఖ్యంగా ఎన్టీఆర్ నుంచి వచ్చిన డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎప్పుడెప్పడు థియేటర్స్ లోకి డ్రాగన్ అడుగుపెడుతుందా అని చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. డ్రాగన్ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో జూన్ 11 న విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One