Dailyhunt
Dragon ఎన్టీఆర్ డ్రాగన్ గురించి షాకింగ్ న్యూస్ ఇంతవరకు టాకీ పార్ట్ స్టార్ట్ కాలేదు!

Dragon ఎన్టీఆర్ డ్రాగన్ గురించి షాకింగ్ న్యూస్ ఇంతవరకు టాకీ పార్ట్ స్టార్ట్ కాలేదు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' (Dragon) గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రణాళికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా పార్ట్-1 కి సంబంధించి అత్యంత కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించడానికి చిత్ర బృందానికి మరో 40 రోజుల సమయం పట్టనుంది. ఇప్పటివరకు పూర్తయిన షూటింగ్ కాకుండా, మరో 40 రోజులు కేవలం యాక్షన్ సీన్స్ కే కేటాయిస్తున్నారంటే..

ఇందులో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ పోర్షన్ పూర్తయిన వెంటనే, 'డ్రాగన్' మూవీ టీమ్ సాంగ్స్ చిత్రీకరణపై దృష్టి సారించనుంది. పాటల షూటింగ్ ముగిసిన తర్వాత చివరిగా టాకీ పోర్షన్‌ను పూర్తి చేసి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. దీనికోసం సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను ప్రారంభించారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One