Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దుండగుల దాడిలో  న్యాయవాది మృతి

దుండగుల దాడిలో న్యాయవాది మృతి

నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్ సమీపంలో నివాసముంటు న్న న్యాయవాది కాజా మొహినుద్దీన్ దారుణహత్యకు గురయ్యారు. శనివానం (మే 23) ఉదయం కోర్టుకు వెళు తున్న సమయంలో గుర్తు తెలియని కొందరు దుండ గులు కారులో వచ్చి అత్యంత వేగంగా న్యాయవాది కాజామొయినుద్దీన్ ను ఢీ కొట్టిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాజా మొహినుద్దీన్ ను కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి డిసిపి చేరుకున్నారు. ఈ హత్య వెనుక భూ వివాదాల కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ భూముల వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మలక్‌పేట్ ప్రాంతంలోని భూ వివాదాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.వక్ఫ్ ఆస్తులు, భూములకు సంబంధించిన అంశాల్లో ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో అడ్వకేట్ కాజా మొయినుద్దీన్‌కు గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. గతంలో కూడా నిందితులు ఇద్దరూ న్యాయవాదికి హాని తలపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యా దులు నమోదైనట్లు తెలిసింది.

జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ కాలేజీల యజమానుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డిసిపి వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One