Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ లక్షణాలు ఉంటే మీ ప్రేగులు బలహీనంగా ఉన్నట్టే లెక్క!

ఈ లక్షణాలు ఉంటే మీ ప్రేగులు బలహీనంగా ఉన్నట్టే లెక్క!

మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది., తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి.

తిన్న ఆహారం నుండి లభించే పోషకాలు రక్తంలోకి శోషించబడేది కూడా ప్రేగుల ద్వారానే. శరీరంలో ఇంత ముఖ్యమైన విధులు నిర్వర్తించే ప్రేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉంటే పైన పేర్కొన్న విధులు మందగిస్తాయి. శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందా లేదా తెలుసుకోవచ్చు.

ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచించే లక్షణాలు.. ఆహారం తిన్న తర్వాత.. ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నా, బరువుగా అనిపించినా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందని అర్థం.

అయితే భారీ ఆహారం తీసుకున్నప్పుడు సాధారణంగానే ఉబ్బరంగా లేదా బరువుగా అనిపిస్తుంది. కానీ సాధారణ ఆహారం తీసుకున్నప్పుడు కూడా బరువుగా అనిపించడం, అది కూడా తరచుగా అనిపిస్తూ ఉంటే.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని అర్థం. మలబద్దకం..

ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఉండే అతిపెద్ద లక్షణం మలబద్దకం. మలం గట్టిగా రావడం లేదా మలవిసర్జన చేసేటప్పుడు గట్టిగా బలవంతంగా విసర్జన చేయడానికి ప్రయత్నించడం వంటివి ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తాయి. అలాగే మలవిసర్జన ప్రతి రోజూ ఒకే సమయానికి కాకుండా అస్తవ్యస్తంగా రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తుంది. గ్యాస్..

నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న గ్యాస్, ఎసిడిటీ, ఛాతీలో మంట వంటి సమస్యలు అన్నీ కేవలం ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వస్తున్నాయని అనుకుంటారు చాలామంది. కానీ ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉంటేనే ఈ సమస్యలు వస్తాయి. అది కూడా గ్యాస్, ఎసిడిటీ, ఛాతీలో మంట వంటి సమస్యలు పదే పదే వస్తాయి. నోటి ఆరోగ్యం..

నాలుక పైన తెల్లటి పూత రావడం, నోటి దుర్వాసన రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఒక సూచన. చాలామందికి నోరు ఎంత శుభ్రం చేసుకున్నా నాలుక మీద తెల్లని పూత, నోటి దుర్వాసన వస్తుంది. ఇలాంటి వారిలో ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆకలి.. ఆకలి సరిగా లేకపోయినా లేదా అతిగా ఆకలి వేసినా కూడా ప్రేగు ఆరోగ్యం సరిగా లేదని అర్థం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. *రూపశ్రీ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One