Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ తో సినిమాలు తెరకెక్కించిన నిర్మాతలుచిరంజీవితో ఎందుకు సినిమాలు చేసారో తెలుసా!

ఎన్టీఆర్ తో సినిమాలు తెరకెక్కించిన నిర్మాతలుచిరంజీవితో ఎందుకు సినిమాలు చేసారో తెలుసా!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా నిద్రలో కూడా గర్వంగా చెప్పుకునే లెజండ్రిస్. తమకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో పెర్ ఫార్మ్ చేసి తెలుగు సినిమాకి గర్వాన్ని పరిచయం చేసారు.

అందులో ఎన్టీఆర్ తొలి ఆద్యుడు కాగా చిరంజీవి మలి ఆద్యుడు. ఈ విషయాన్నీ ముందుగానే గమనించారేమో ఎన్టీఆర్ తో మాత్రమే సినిమాలు నిర్మిస్తూ ఎన్టీఆర్ నిర్మాతలుగా ముద్రపడిన వాళ్ళందరు చిరంజీవి తో ఆయన కెరీర్ స్టార్టింగ్ లో సినిమాలు తెరకెక్కించారు. అందుకు రహస్యం ఏంటి అని విశ్లేషిస్తే, ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తాయి. మొదటిది: ఆ నిర్మాతలకు సినిమాలపై ఉన్న అపారమైన పిచ్చి.

వర్ణించలేని ప్యాషన్. లాభనష్టాల లెక్కల కంటే, ప్రేక్షకులకు ఒక గొప్ప దృశ్యకావ్యాన్ని అందించాలనే తపన ఆ అందరిలో నరనరాన జీర్ణించుకుపోయింది. సినిమా నిర్మాణాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా ఒక పవిత్రమైన కళగా భావించారు. ప్రతి సన్నివేశం, ప్రతి పాట, కథలోని ప్రతి మలుపు పర్ఫెక్ట్‌గా ఉండాలనే వారి కోరిక మరియు రాజీపడని నైజమే వారిని అగ్ర నిర్మాతలుగా నిలబెట్టింది.

రెండవది: ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ, కృషిని సినీ డిక్షనరీగా భావించే ఆ నిర్మాతలు, చిరంజీవిలో కూడా సరిగ్గా అదే రకమైన అంకితభావాన్ని చూశారు. డ్యాన్స్, ఫైట్స్, నటన ఇలా ఏ విషయంలోనూ చిరంజీవి షార్ట్‌కట్‌లు వెతకలేదు. స్వయంకృషినే నమ్ముకుని, ప్రతి సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమించే ఆయన తత్వానికి ఎన్టీఆర్ నిర్మాతలు ఫిదా అయ్యారు. చిరంజీవి పట్టుదల, నిర్మాతల నిర్మాణ ప్యాషన్ కలిసి తెలుగు సినీ రంగానికి మరచిపోలేని సువర్ణ అధ్యాయాలను, రికార్డు కలెక్షన్లని తెలుగు సినిమాకి, ప్రేక్షకులకి కానుకగా ఇచ్చాయి. Also read: Romachakam Movie Review Telugu: రోమాంచకం మూవీ రివ్యూ ఇద్దరి నిర్మాతల లిస్ట్ చూసుకుంటే పుండరీ కాక్షయ్య అట్లూరి, దేవీవరప్రసాద్, తాతినేని త్రివిక్రమ్ రావు, అశ్వనీ దత్, కెఎస్ రామారావు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు ఇలా తదితర ఎన్టీఆర్ నిర్మాతలగా ముద్రపడిన వాళ్ళందరు చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో సినిమాలు చేసారు. Ntr, Chiranjeevi, ks RamaRao, DeviVaraprasad, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywoodnews

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One