ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. జూన్ 1 నుండి నవంబరు 30 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సాయి ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండగా, ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

