Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్‌వికృష్ణారెడ్డి సినిమాను సౌందర్య రిజెక్ట్ చేశారు ఎందుకో తెలుసా

ఎస్‌వికృష్ణారెడ్డి సినిమాను సౌందర్య రిజెక్ట్ చేశారు ఎందుకో తెలుసా

మీ సినిమా చిన్న సీన్ అయినా ఇవ్వండి, క్యారెక్టర్ ఏంటి, ఎవరి పక్కన చెయ్యాలి.. ఇలా దేని గురించీ అడగను. మీ సినిమాలో నటించాలి అంతే.. ఈ మాట ఎవరు, ఎవరితో అన్నారో తెలుసా..

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య, ఫ్యామిలీ డైరెక్టర్ ఎస్‌.వి.కృష్ణారెడ్డిని ఈ విధంగా వేడుకున్నారు. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నెంబర్‌వన్ వంటి సూపర్‌హిట్ సినిమాలతో హీరోయిన్‌గా సౌందర్యకు మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. అంత మంచి కాంబినేషన్ తర్వాత కృష్ణారెడ్డి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సౌందర్య హీరోయిన్‌గా నటించేందుకు ఒప్పుకోలేదు. దానికి కారణం ఏమిటి?

వీరిద్దరి మధ్య ఏం జరిగింది? మళ్లీ కృష్ణారెడ్డి దగ్గరకి సౌందర్య ఎందుకు వచ్చారు? చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను ఇవ్వండి ప్లీజ్ అని ఎందుకు ప్రాధేయపడ్డారు? దీని వెనుక ఒక కథ ఉంది.

కర్ణాటకకు చెందిన సౌందర్య చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి మొదట కన్న సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మనవరాలి పెళ్లి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో తను డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డిను సౌందర్య అందం, అభినయం ఆకట్టుకుంది. అలా తను డైరెక్ట్ చేస్తున్న రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు.

ఆ తర్వాత మాయలోడు, నెంబర్‌వన్ సినిమాల్లో కూడా సౌందర్య హీరోయిన్‌గా నటించింది. ఆ మూడు సినిమాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణారెడ్డి అలీతో యమలీల చిత్రం ప్లాన్ చేశారు. సౌందర్యను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే అప్పటికే హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉన్న సౌందర్య కమెడియన్ అలీ పక్కన హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పుకోలేదు.

ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు అలీ పక్కన హీరోయిన్‌గా చెయ్యొద్దని చెప్పడమే దానికి కారణం. చేసేది లేక యమలీల చిత్రంలో ఇంద్రజను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హీరోగా అలీకి, హీరోయిన్ ఇంద్రజకు, దర్శకుడుగా ఎస్‌.వి.కృష్ణారెడ్డికి చాలా మంచి పేరు తెచ్చిన సినిమా అది.

తనకు మూడు సూపర్‌హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ మాటను కాదన్నందుకు సౌందర్య ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత కృష్ణారెడ్డిని కలిసిన సౌందర్య ఆయన డైరెక్ట్ చేసే సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. ఆ సమయంలో శుభలగ్నం చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు కృష్ణారెడ్డి. ఎవరి పక్కన అయితే హీరోయిన్‌గా నటించేందుకు సౌందర్య ఒప్పుకోలేదో అదే అలీతో చినుకు చినుకు అందెలతో..

అనే పాటలో సౌందర్య నటించి మెప్పించారు. అలా తను చేసిన తప్పును సరిదద్దుకొని మళ్లీ ఎస్‌.వి.కృష్ణారెడ్డితో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత టాప్ హీరో, ప్రేమకు వేళాయెరా వంటి సినిమాల్లో సౌందర్య హీరోయిన్‌గా నటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One