బుల్లితెర మీద ఇప్పుడు కనిపిస్తున్న యాంకర్స్ లో సుమ, సుధీర్, శ్రీముఖి వీళ్ళు తప్ప ఇంకెవరు కనిపించడం లేదు. ఐతే వీళ్ళలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని కొండేటి సురేష్ రీసెంట్ గా ప్రసారమైన సర్కార్ ఎపిసోడ్ లో చెప్పారు.
"మనం కోటి రూపాయలు సంపాదించడానికి టైం పడుతుంది కానీ సుధీర్ ఒక ఎపిసోడ్ కే 3 లక్షలు తీసుకుంటున్నాడు తెలుసా మీకు" అని కొండేటి సురేష్ అన్నారు. "ఉంది కానీ 3 ఐతే కాదు" అన్నాడు సుధీర్. వెంటనే సురేష్ "ఫిమేల్ లో సుమ, మేల్ లో సుధీర్ " అన్నారు. "ప్రదీప్ మరి" అని విష్ణుప్రియ అంది.
"ప్రదీప్ హీరో లెక్కలోకి వెళ్ళిపోయాడు." అన్నారు సురేష్. "అంటే నువ్వు ఇంకా హీరో లెక్కలోకి రాలేదు " అని విష్ణు ప్రియా వెటకారంగా సుధీర్ మీదకెళ్ళి మరీ చెప్పింది. "అంటే ఆయన హీరో కాకపోతే అంత ఆనందమా" అని మూర్తి ఆమె అన్నారు. "ఆనందాలన్నీ తాపాలన్నీ ఈయన మీదే " అంది విష్ణుప్రియ.
"పాపాలు అవన్నీ నాకు " అని సుధీర్ అన్నాడు. "తాపాలు అన్నా పాపాలు అనలేదు " అంది విష్ణుప్రియ. "పాపాల కంటే తాపాలు డేంజర్ " అన్నారు ప్రభు. సరే అసలు కోటి రూపాయలు వస్తే ఎం చేస్తావు అని సుధీర్ విష్ణుప్రియను అడిగాడు.
"కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు తెలీదు. రూపాయలో ఎన్ని సున్నాలు " అని విష్ణు ప్రియా నాన్చేసరికి రూపాయలో ఎన్ని సున్నాలా" అని సుధీర్ షాకయ్యాడు. "నెక్స్ట్ సీజన్ సర్కార్ 7 విష్ణు ప్రియా, కొండేటి సురేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి " అన్నాడు సుధీర్. ఇలా ఈవారం షో ఎండ్ అయ్యింది.

