Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యాన్ చేతి మీద సుధీర్ పచ్చబొట్టు!

ఫ్యాన్ చేతి మీద సుధీర్ పచ్చబొట్టు!

సుధీర్ నటిస్తున్న జోకర్ మూవీ ఫ్యాన్ మీట్ లో సుధీర్ ఫాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో అనవసర కంటెంట్ పెట్టి ఫాన్స్ టైం వేస్ట్ చేయకూడదు అంటూ ఎన్నో విలువైన మాటలు కూడా చెప్పాడు.

"అన్నా పెళ్ళెప్పుడు చేసుకుందామనుకుంటున్నారు. అన్నా అమ్మాయి దొరికిందా ఇంకా టైం తీసుకుందామనుకుంటున్నారా " అంటూ ఫ్యాన్ అడిగేసరికి సుధీర్ నవ్వేసాడు. "పుట్టినరోజు నాడు హ్యాపీగా ఉండే ప్రశ్నలు అడగకుండా . హ్యాపీగా ఉన్నప్పుడు బాదెప్పుడు పడతావన్నా అని అడిగినట్టుంది.

పెళ్లి ప్రస్తుతానికి తెలీదు. అది తెలిసిన వెంటనే నేనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను. ప్రణయ్ వరంగల్ ఫ్యాన్ "మీ జర్నీలో మీకు సంతోషాన్ని కలిగించిన కాంప్లిమెంట్ ఏంటి " అని అడిగాడు. "ఎవరినైనా కలిసినప్పుడు మీ జర్నీ నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది అని అన్నప్పుడు ఆ కాంప్లిమెంట్ నాకు హ్యాపీగా ఉంటుంది.

అంటే నాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రజనీకాంత్ గారు ఇన్స్పిరేషన్. అలా నేనంటే ఇన్స్పిరేషన్ అంటూ చిన్నవాళ్లు వచ్చి నాకు చెప్తూ ఉంటే అది నాకు సంతోషాన్ని ఇస్తుంది నా బాధ్యతను ఇంకా పెంచుతుంది. నా పేరెంట్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అది నాకు పెద్ద కాంప్లిమెంట్ కూడా " అన్నారు సుధీర్ . గుంటూరు నుంచి ఫ్యాన్ శివ వచ్చి సుధీర్ అంటే తనకు ఎంతో ఇష్టం అని అతను ఎప్పుడూ కళ్ళ ముందే ఉండాలంటూ 5 గంటల పాటు కష్టపడి తన చేతి మీద సుధీర్ బొమ్మను పచ్చబొట్టుగా వేయించకున్నాని చూపించాడు.

ఇక సుధీర్ ఐతే షాకై అలాంటివి ఏమీ చేయొద్దు అన్నాడు. పవన్ కళ్యాణ్ తర్వాత సుధీర్ అన్నకే భక్తులు ఉంటారు అని చెప్పాడు. ఇక తమిళనాడు నుంచి కొంతమంది ఫాన్స్ వచ్చి ఈ మూవీని తమిళనాడులో కూడా విడుదల చేయాలనీ కోరుకున్నారు. "సోషల్ మీడియాలో దేనికి రియాక్ట్ కాదు కాదన్నా ఎందుకు " అంటూ ఒక ఫ్యాన్ అడిగాడు.

"సోషల్ మీడియాకి, ఫోన్స్ కి ఎంత దూరంగా ఉంటామో అంత ప్రశాంతంగా ఉంటాము. నేను ఇది చేస్తున్నా ఇక్కడికి వెళ్తున్నా అని ఊరికే ఏదో ఒకటి పెట్టేసి మీ టైం వేస్ట్ చేయాలనీ అనుకోవట్లేదు. ఇప్పుడు చూడండి జోకర్ రిలీజ్ అవుతోంది. ఇలాంటి పనికొచ్చే ఇంఫార్మేషన్ తెలియాలి అంతే" అని చెప్పాడు. రెండు నిమిషాలు నన్ను చూడడం కోసం అంత దూరాల నుంచి రావొద్దు అన్నావ్ కదా అన్న తిరుపతి వెళ్తే అక్కడ వెంకన్న సామిని కూడా రెండు నిమిషాలే చూడగలుగుతాం నువ్వు మా దేవుడివన్న అంటూ ఇంకో ఫ్యాన్ చెప్పేసరికి సుధీర్ కి మాటల్లేకుండాపోయాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One