Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాడ్ ఆఫ్ వార్ కోసం మాస్టర్ ప్లాన్ మిగతా సినిమాలు హోల్డ్!

గాడ్ ఆఫ్ వార్ కోసం మాస్టర్ ప్లాన్ మిగతా సినిమాలు హోల్డ్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్', అలాగే 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' ముందు వరుసలో ఉంటాయి. సాధారణంగా ఈ నిర్మాణ సంస్థల కాంపౌండ్ లో ఎప్పుడూ చూసినా నాలుగైదు సినిమాలు ఒకేసారి రన్నింగ్ లో ఉండటం కామన్.

ఒక వైపు పెద్ద హీరోల బిగ్ బడ్జెట్ సినిమాలు, మరోవైపు యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ తీసే ప్రామిసింగ్ ప్రాజెక్టులు ఎప్పుడూ సెట్స్ పై సందడి చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ బ్యానర్స్ ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం తమ వర్కింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకోబోతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. అదే పవర్ ఫుల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్'. 'గాడ్ ఆఫ్ వార్' సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లకు అన్ని రకాలుగానూ అత్యంత కీలంగా మారనుంది.

ఈ భారీ బడ్జెట్ మైథలాజికల్ ప్రాజెక్ట్ పై నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ సినిమా ప్రొడక్షన్ పరంగా ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదని, మేకింగ్ లో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ కారణంతోనే సినిమా షూటింగ్ మొదలయ్యే లోపు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సాధారణంగా ఒకేసారి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండే ఈ సంస్థలు, 'గాడ్ ఆఫ్ వార్' సెట్స్ పైకి వెళ్లేలోపే ప్రస్తుతం చేతిలో ఉన్న మిగతా సినిమాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.

అంతేకాకుండా, ఇంకా ప్రారంభ దశలో ఉన్న కొన్ని ఇతర ప్రాజెక్ట్‌లను తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని తెలుస్తోంది. నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా ఫినిష్ చేసి, కొత్తగా అనుకున్న ప్రాజెక్టులను కాస్త పక్కన పెట్టి, ప్రొడక్షన్ హౌస్ లోని మొత్తం ఫోకస్, రిసోర్సెస్ ను కేవలం ఈ ఒక్క సినిమా పైనే పెట్టబోతున్నారట. ఈ స్థాయిలో ప్రొడక్షన్ మొత్తం ఒకే సినిమాపై దృష్టి పెట్టడం అనేది టాలీవుడ్ లో చాలా అరుదుగా చూస్తుంటాం. 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ స్కేల్, దాని ప్రాముఖ్యత ఎంతటిదో ఈ నిర్ణయమే స్పష్టం చేస్తోంది. ఏ రకమైన డిస్ట్రాక్షన్ లేకుండా, అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో, అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రొడక్షన్ టీమ్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి. God Of War, Jr NTR, Trivikram

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One