Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Godavari  మురళికి ఊహించని షాక్ ఇచ్చిన నందుసింహాద్రికి జాను స్ట్రాంగ్ వార్నింగ్

Godavari మురళికి ఊహించని షాక్ ఇచ్చిన నందుసింహాద్రికి జాను స్ట్రాంగ్ వార్నింగ్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -74 లో.. నేను ఫ్యామిలీ కోసం ఎంతటి త్యాగం అయినా చెయ్యడానికి రెడీగా ఉంటానని జాను తన ఫ్యామిలీకి చెప్తుంది.

ఆ తర్వాత సూర్య జరిగింది గుర్తుచేసుకొని బాధపడుతాడు. భువన వస్తుంది. అమ్మ.. నీతో మాట్లాడాలి నువ్వు చేసింది తప్పు..

వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారని సూర్య అనగానే అంటే నేను ఫీల్ అయ్యేది కన్పించడం లేదా అని అనేసి భువన కోపంగా వెళ్తుంది. అంతలో తుఫాన్ వచ్చి సూర్యని ఇరిటేట్ చేస్తాడు. దాంతో అతని చెంప చెల్లుమనిపిస్తాడు సూర్య. ఆ తర్వాత రాత్రి నందు నిద్రపోయాక నిద్రలో మురళిని తంతుంది.

దాంతో తను కింద పడుతాడు. అయ్యో సారీ బావ అని నందు అంటుంది. నందుకి వాటర్ ఇవ్వబోతుంటే వాటర్ తన చీరపై పడుతాయి. చేంజ్ చేసుకో నందు అని మురళి చెప్తాడు.

దాంతో మురళి కళ్ళకి కాళ్ళకి చేతులకి గంతలు కట్టి నందు చీర మార్చుకుంటుంది. మురళి కాళ్ళకి ఉన్న కట్లు తగిలి మురళి బెడ్ పై పడుతాడు. తన మీద నందు పడుతుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు.

మరుసటిరోజు కిన్నెరని జాను స్కూల్ లో డ్రాప్ చేస్తుంది. అక్క నీకు సూర్య అంటే ఇష్టమా అని కిన్నెర అడుగుతుంది. సూర్యుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అని జాను అంటుంది. అప్పుడే సూర్య వచ్చి బాగా అడిగింది కదా అని అంటాడు.

అప్పుడే సింహాద్రి వస్తాడు. మా చెల్లి ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన మీకు బుద్ది రాలేదా అని సింహాద్రి అనగానే తనకి జాను వార్నింగ్ ఇస్తుంది.. కావాలనే సూర్య స్కూటీ తియ్ అని సూర్య వెనకాల స్కూటీ ఎక్కి సూర్య భజాలపై చెయ్ వేస్తుంది. ఆ తర్వాత కొద్దీ దూరం వెళ్ళాక సూర్యని దిగమని చెప్పి వెళ్ళమంటుంది.

అంటే మా మావయ్య మీద కోపంతో ఇలా చేసావ్ కానీ ప్రేమతో కాదా అని సూర్య అనగానే రెండిటితో అని జాను అంటుంది. ముందు నువ్వు మీ అమ్మని ఒప్పించమని జాను అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ తన ఫ్రెండ్స్ తో కాలేజీలో ఉంటాడు. పాపం వీడు అనుకున్నది ఏం జరగట్లేదని తన ఫ్రెండ్స్ కళ్యాణ్ తో అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One