Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Godhavari  రౌడీలపై విరుచుకుపడ్డ సూర్య కొడుకుని చితక్కొట్టిన తల్లి

Godhavari రౌడీలపై విరుచుకుపడ్డ సూర్య కొడుకుని చితక్కొట్టిన తల్లి

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-09 లో.. సూర్య వాళ్ళ అమ్మ భువనతో రియల్ ఎస్టేట్ చేసే రౌడీలు మిస్ బిహేవ్ చేస్తారు.

దాంతో అదంతా వీడియో తీసి సూర్యకి పంపిస్తాడు తుఫాన్. ఇక రౌడీలు వెళ్ళిపోయాక .. మీరేఙ టెన్షన్ పడకండి అమ్మ.. ఇదంతా వీడియో తీసి సూర్య బాబుకి పంపించానని తుఫాన్ అంటాడు.

అయ్యో ఎందుకు పంపావ్ రా..వాడు ఇప్పుడు ఇక్కడికి రాడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక చేసేదేమీ లేక వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది భువన. మరోవైపు ఆ రౌడీలని వెతుక్కుంటూ సూర్య వెళ్తాడు. వాళ్ళని ఇష్టమొచ్చినట్టు కొడుతుంటాడు సూర్య.

ఇక అక్కడికి భువన, భువన వాళ్ళ అన్నయ్య, తుఫాన్ అందరు వెళ్తారు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఆ రౌడీలని కొడుతూనే ఉంటాడు సూర్య. ఇక చేసేదేమీ లేక సూర్యని కొడుతుంది భువన. దాంతో అతను ఆగిపోతాడు.

రౌడీలు పారిపోతారు. సూర్య ఒక దగ్గర కూర్చుని బాధపడుతుంటే భువన వాళ్ళ అన్నయ్య వచ్చి ఓదారుస్తాడు. అయినా ఏంటమ్మా నువ్వు.. సూర్య ఏం అయినా చిన్నపిల్లాడా కొట్టడానికి అని అతను అనగానే నా మాట వినట్లేదు కాబట్టే వింటాడని కొట్టానని భువన అంటుంది.

రౌడీలని కొట్టడం ఎందుకు అని భువన అనగానే నా తల్లితో పిచ్చి వాగుడు వాగిన వాళ్ళని ఏం అనకూడదా అని సూర్య అంటాడు. ఎందుకంటావ్.. వాళ్ళు అన్నది కరెక్టే కదా.. నాకు ఏ మగదిక్కు లేదు..

మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు.. నువ్వు చదువులంటూ వదిలేసి వెళ్ళిపోయావ్.. ఆ రౌడీలతో గొడవ పెట్టుకొని నీకేదైనా అయితే నాకు దిక్కెవరు.. నన్ను చూసుకునేది ఎవరని భువన అనగానే సూర్య అక్కడి నుండి వెళ్తాడు.

మరోవైపు అలకనంద ఇంట్లో జరిగింది తల్చుకొని బాధపడుతుంటే తన చెల్లెల్లు ఇద్దరు తనకి అన్నం తినమని తీసుకొస్తారు. నేను తినని అలకనంద అంటుంది. ఇక అలకనంద వాళ్ళ అమ్మ, నానమ్మ వచ్చి.. మరళి నీ మీదే ఆశలు పెట్టుకున్నాడు పెళ్ళి చేసుకోమని అంటారు నాకు ఇష్టం లేదని అలకనంద అంటుంది.

మరోవైపు జరిగింది తల్చుకొని బాధపడుతూ జాను గోదావరి దగ్గరకి వెళ్తుంది. ఇక గోదావరిలోని బోట్ లో జాను వెళ్ళగానే అక్కడ సూర్య కనపడతాడు. అతడిని చూసి ఏంటి నువ్విక్కడ అని జాను అడుగగా మా అమ్మతో చిన్న గొడవ అని సూర్య అంటాడు. నాకు ఇంట్లో చిన్న డిష్యూమ్ అయిందని జాను అంటుంది.

ఏంటని సూర్య అడుగగా జరిగిందంతా చెప్తుంది జాను. అయినా అమ్మనాన్నలు పిల్లల మనసుని అర్ధం చేసుకోవాలి.. ఇరవై ఏళ్ళు పెంచారని.. జీవితాంతం తోడు ఉండే వారి గురించి సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉండదా అని అలకనందకి సపోర్ట్ గా మాట్లాడతాడు.

దాంతో జాను కన్విన్స్ అయిపోతుంది. ఇక సూర్యకి థాంక్స్ అంటూ చేతిని ఇస్తుంది. దాంతో అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One