Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gunasekhar త్రివిక్రమ్ పై గుణశేఖర్ వ్యాఖ్యలు వైరల్ నా పాయింట్ సక్సెస్ అయినందుకు హ్యాపీ

Gunasekhar త్రివిక్రమ్ పై గుణశేఖర్ వ్యాఖ్యలు వైరల్ నా పాయింట్ సక్సెస్ అయినందుకు హ్యాపీ

థకి తగ్గ టేకింగ్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసే దర్శకుడు గుణశేఖర్(Gunasekhar). పౌరాణిక, చారిత్రక చిత్రాల దర్శకుడిగా కూడా గుణశేఖర్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

ఆయన కలల ప్రాజెక్టులలో 'హిరణ్యకశ్యప' ఒకటి. రానా దగ్గుబాటి(Rana Daggubati)టైటిల్ రోల్ లో తెరకెక్కించేందుకు ఏడుసంవత్సరాల పాటు సుదీర్ఘంగా శ్రమించారు. ప్రతి సన్నివేశాన్ని త్రీడీ ఫార్మాట్‌లో ఊహిస్తూ ఎంతో కష్టపడి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఆ సమయంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్, డిస్నీ వంటి అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్ వైపు మొగ్గు చూపాయి.

300 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అంచనా వేయడంతో, ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారి పరిస్థితులు, స్టూడియో అంతర్గత మార్పుల వల్ల ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే రానా,త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం పట్టాలెక్కబోతోందనే వార్తలు టాలీవుడ్‌లో ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. దీంతో సదరు సబ్జెట్ ని గుణశేఖర్ పక్కన పెట్టబడ్డారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై గతంలో గుణశేఖర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తినివ్యక్తం చేశారు.

దేవుడిని కేంద్రంగా పెట్టుకుని సినిమా చేసేటప్పుడు నైతికత ముఖ్యమని పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు. దీంతో ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు జూన్ 2న తన పుట్టినరోజును పురస్కరించుకుని గుణశేఖర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడుతు 'హిరణ్యకశ్యపని త్రివిక్రమ్ గారే పూర్తిగా హ్యాండిల్ చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది.

దాంతో నేరుగా నేనే ఒకరోజు త్రివిక్రమ్ గారికి ఫోన్ చేశాను. ఆయన నాతో నేను ఈ ప్రాజెక్ట్‌లో కేవలం రచన పరంగా, డైలాగ్స్ రాసేందుకు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాను. అంతే తప్ప ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఎంతో హుందాగా ఆన్సర్ ఇచ్చారని గుణశేఖర్ స్పష్టం చేశారు. నేను అనుకున్న నేపధ్యంతోనే వచ్చిన 'మహాఅవతార్ నరసింహ'(Mahavathar Narasimha)బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్లపైన కలెక్షన్లు రాబట్టడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రీవియస్ మూవీ 'యుఫోరియా'సక్సెస్ ఇచ్చిన నమ్మకంతో, భవిష్యత్తులో వేరే నిర్మాతలతో కలిసి మరిన్ని వైవిధ్యమైన సినిమాలు చేస్తానని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One