Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్ 3.0

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్ 3.0

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరుతో 15 రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడేలలె సైబర్ నేరగాళ్లకు సహక రిస్తున్న కీలక ముఠాల గుట్టు రట్టు చేశారు.

రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో పోలీసులు సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. సైబర్ మోసాలకు ఉపయోగించే సిమ్ కార్డులను అక్రమంగా సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రధానంగా దృష్టి సారించిన హైదరాబాద్ సైబర్ పోలీసులు ఇప్పటివరకు 10 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అలాగే సైబర్ నేరగాళ్లకు మధ్యవర్తులుగా పనిచేస్తున్న మరో 30 మందికి నోటీసులు జారీ చేశారు. నెట్‌వర్క్ స్థాయిలో పనిచేస్తున్న ఈ ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్ కొనసాగుతుండగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 1.0 లో సైబర్ క్రిమినల్స్ కు బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న అకౌంట్ హోల్డర్లపై చర్యలు తీసుకోగా, ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 లో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 ద్వారా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న నెట్‌వర్క్‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ క్రైమ్ మూలాలను కట్టడి చేయడంపై పోలీసులు దృష్టి పెట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One