Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మూజ్ లో  వాణిజ్య నౌకలకు అమెరికా రక్షణ.!

హర్మూజ్ లో వాణిజ్య నౌకలకు అమెరికా రక్షణ.!

ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేశామంటూ ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా నిర్ద్వంద్వంగా ఖండాంచింది. అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన ఈ సముద్ర మార్గాన్ని తాము పూర్తిగా మూసివేశామన్న ఇరాన్ ప్రచారాన్ని నమ్మవద్దన్న అగ్రరాజ్యం..

హర్మూజ్ జలసంధి మూతపడలేదని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ జలమార్గం సురక్షితంగా తెరిచే ఉందని ప్రకటించింది. అమెరికా బలగాలు ఈ మార్గంలో నౌకల రక్షణ కోసం నిరంతరం పహారా కాస్తున్నాయని పేర్కొంది. దీని వల్ల ఈ మార్గం గుండా వాణిజ్యం నౌకల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదని అమెరికా ఆర్మీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను కూడా వెల్లడించింది.

ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు అమెరికా సైనిక బలగాలు వెయ్యికి పైగా వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటేందుకు సహాయ సహకారాలు అందించాయని సెంట్‌కామ్‌ ప్రకటించింది. ఈ వెయ్యి నౌకల ద్వారా ప్రపంచవ్యాప్త ఇంధన అవసరాల కోసం 50 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయిందని పేర్కొంది. అంతర్జాతీయ జలమార్గాలను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఇష్టారీతిన మూసివేసే లేదా అడ్డుకునే ఎలాంటి చట్టబద్ధమైన అధికారం ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్‌కు ఇసుమంతైనా లేదని సెంట్‌కామ్ కుండబద్దలు కొట్టినట్లు పేర్కొంది. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

అంతర్జాతీయ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్య భద్రతకు పూర్తి భరోసా ఇస్తూనే.. ఇరాన్ నౌకాశ్రయాలపై తమ దేశం విధించిన ఆంక్షలను అమెరికా అమలు చేస్తోంది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రయాణించేందుకు ప్రయత్నించిన నౌకలపై అమెరికా నౌకాదళం ఉక్కుపాదం మోపింది. జులై చివరినాటికి అంతర్జాతీయ నిబంధనలను ధిక్కరించిన 30 వాణిజ్య నౌకలను అమెరికా నౌకాదళం దారి మళ్లించింది. Strait of Hormuz, US Central Command, CENTCOM Iran news, Crude oil transport, Persian Gulf security, US Navy ships protection

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One