Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీరోయిన్‌గా గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్స్‌ నో చెప్పిన యాంకర్‌

హీరోయిన్‌గా గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్స్‌ నో చెప్పిన యాంకర్‌

టాలీవుడ్‌లో ప్రస్తుతం జరుగుతున్న సినిమా ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో తనదైన మార్క్ హోస్టింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది పాపులర్ యాంకర్ చర్మిల నల్లూరి.

సమయస్ఫూర్తితో మాట్లాడటం, వేదికపై ఎంతో ఎనర్జెటిక్‌గా కనిపించడంతో చాలా తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇదిలా ఉంటే, చర్మిలలోని ప్రతిభను గుర్తించిన పరిశ్రమలోని దిగ్గజ నిర్మాతలు ఆమెకు వెండితెరపై హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఆఫర్ చేశారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో పాటు సీనియర్ నిర్మాత కమ్ డైరెక్టర్ ఎమ్.ఎస్. రాజు కూడా తమ చిత్రాల్లో చర్మిల నల్లూరిని హీరోయిన్‌గా నటిస్తావా అంటూ ఆఫర్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

వెండితెరపై మెరవాలని, హీరోయిన్ కావాలని ఎంతోమంది కలలు కంటుంటే.. వచ్చిన అవకాశాన్ని చర్మిల మాత్రం సున్నితంగా తిరస్కరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ స్టార్ యాంకర్, ఆ భారీ ఆఫర్లను వద్దనుకోవడానికి గల అసలు కారణాన్ని వివరించారు. తనకు నటించాలనే ఆలోచన గానీ, ఆసక్తి గానీ ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు.

అంతేకాకుండా, తనకు నటన వైపు వెళ్లడం ఇష్టం లేకపోవడంతో పాటు, తన తల్లిదండ్రులకు కూడా తాను సినిమాల్లో యాక్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదని చర్మిల తెలిపారు. పేరెంట్స్ మాట దాటి యాక్టింగ్‌లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేవలం యాంకరింగ్ రంగంలోనే మైక్ పట్టుకుని మరింత ఎత్తుకు ఎదగడమే తన ఏకైక లక్ష్యమని ఆత్మవిశ్వాసంతో వెల్లడించారు. చిత్రసీమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినప్పటికీ, అల్లు అరవింద్, ఎమ్.ఎస్.రాజు వంటి అగ్ర నిర్మాతలు తనను ఎంతగానో ప్రోత్సహించి హీరోయిన్ ఆఫర్స్ ఇవ్వడం వారి గొప్పదనానికి నిదర్శనమని ఈ బ్యూటీ పేర్కొన్నారు.

సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అపరిమితమైన అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్మిల నల్లూరి నిర్ణయంపై జోరుగా చర్చ జరుగుతోంది. అవకాశాలు వచ్చినా కంగారు పడకుండా తన కెరీర్ లక్ష్యాలకు కట్టుబడి ఉండటంపై నెటిజన్లు, ఫ్యాన్స్ ఆమెను అభినందిస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ తన ప్రాధాన్యతలపై స్పష్టమైన విజన్ ఉండటం చాలా గొప్ప విషయమని సినీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One