Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హుస్సేన్‌సాగర్ అంచు నుంచి. కొత్త జీవితానికి అడుగులు

హుస్సేన్‌సాగర్ అంచు నుంచి. కొత్త జీవితానికి అడుగులు

హైదరాబాద్‌లో ఒక తల్లి తీసుకున్న నిర్ణయం చివరి క్షణంలో మారి, మూడు ప్రాణాలు కాపాడిన సంఘటన ఇది. కుటుంబ కలహా లతో తీవ్రంగా కలత చెందిన ఓ వివాహిత, తన ఇద్దరు చిన్నారులతో కలిసి హుస్సే న్‌సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

తన పిల్లలతో కలిసి జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న ఆమె హుస్సేన్ సాగర్ వైపు వెడుతుండగా, దారిలో రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే.. పోలీసులకు చెప్పుకుంటే తన కష్టం తీరుతుందేమోనన్న ఆశకలిగింది. వెంటనే స్టేషన్‌లోకి అడుగు పెట్టిన ఆమెను చూడగానే పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ముందుగా తల్లీబిడ్డలకు ఆహారం పెట్టారు.

ఆ తర్వాత ప్రేమగా మాట్లాడారు… ఓదార్చారు…ఆమె బాధ మొత్తం విన్నారు. భర్త వదిలేయడం… పుట్టింట్లో అవమానాలు, ఒంటరితనం ఇలా తన కష్టాలను, మనసులోని బాధను ఆమె పోలీసులకు చెప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చావు పరిష్కారం కాదనీ, పిల్లలే ఆమె బలమనీ చెప్పారు.

పోలీసుల మాటలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం మానుకుంది. పోలీసులు ఆమెను సఖి సెంటర్ కు తరలించి పూర్తి సహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఒక క్షణం, ఒక నిర్ణయం, పోలీసులను ఆశ్రయించాలన్న ఆమె ఆశ మూడు ప్రాణాలకు కొత్త జీవితం ఇచ్చింది. ఈ ఘటనలో పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లల జీవితాలను కాపాడి కొత్త దారి చూపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One