Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Illu illalu pillalu  ప్రసాదరావు గర్వమణచిన ధీరజ్ 10 వేల టీ బిల్లుతో మైండ్ బ్లాక్ ట్విస్ట్

Illu illalu pillalu ప్రసాదరావు గర్వమణచిన ధీరజ్ 10 వేల టీ బిల్లుతో మైండ్ బ్లాక్ ట్విస్ట్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -486 లో.. ప్రసాదరావు కూతురు వేరు కాపురం పెట్టిందని నర్మదకి సారె తీసుకొని వస్తాడు.

అవన్నీ వస్తువులు చూసి ఎందుకు తీసుకొని వచ్చావని నర్మద కోప్పడుతుంది. నువ్వు అమ్మానాన్నలని వదులుకున్నంత ఈజీగా మేం వదులుకోలేము కదా అని ప్రసాదరావు అంటాడు. ఇప్పటికే మా కొడుకుని విడకొట్టి వేరు కాపురం పెట్టేలా చేశారు.. ఇప్పుడు ఈ సామాను తీసుకొని వచ్చి ఇంకా దూరం చెయ్యాలనుకుంటున్నారా అని వేదవతి కోప్పడుతుంది.

ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకొని వచ్చారని వేదవతి అంటుంటే తీసుకొని వస్తే తప్పేంటని సాగర్ ఎంట్రీ ఇస్తాడు. ఒరేయ్ నడిపోడా ఏం మాట్లాడుతున్నావని వేదవతి అంటుంది. నీకు నీ పుట్టింటివాళ్ళు పెట్టలేదని అందరికి అలాగే పెట్టొద్దనుకుంటే ఎలా అని సాగర్ అనగానే సాగర్ నీకు బుద్ది ఉందా ఏం మాట్లాడుతున్నావని నర్మద కోప్పడుతుంది. ఆ తర్వాత సాగర్, ప్రసాదరావు సామాను మోస్తుంటే సాగర్ కాలుపై పడేసుకొని అమ్మ అంటాడు.

అమ్మ అని ఎందుకు అరుస్తున్నావ్ రా అని ధీరజ్ అంటాడు. ఇక్కడ మిల్ లో పని చేసే చాలా మంది కూలీలున్నారు కదా.. వాళ్ళు సామాను మోస్తే వాళ్ళకి డబ్బు ఇస్తానని ప్రసాదరావు అంటాడు. దాంతో రామరాజు కోపంగా ముందుకి వస్తుంటే ప్రసాదరావుకి కౌంటర్ ఇవ్వాలని అతన్ని ధీరజ్ ఆపుతాడు.

మేం సామాను మోస్తా.ని ధీరజ్ అంటాడు. తిరుపతి, ధీరజ్ సామాను మోస్తారు. ప్రేమ టీ పెడుతుంది. టీ తాగి టీకి కూడా డబ్బు ఇవ్వండి అని ధీరజ్ అంటాడు.

మొత్తం ఏంత అని ప్రసాదరావు అంటాడు. మొత్తం ఎనిమిది వేలు ఇంకా టీకి రెండు వేలు అనగానే ప్రసాదరావు షాక్ అవుతాడు. నువ్వు కుటుంబంలో గొడవలు పెట్టడమే కాదు డబ్బు కూడా ఎగ్గొడుతావా అని ధీరజ్ వెటకారంగా మాట్లాడుతాడు. దాంతో ప్రసాదరావు డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత వర్క్ డబ్బుని ధీరజ్, తిరుపతి పంచుకుంటారు. తిరుపతి షాపింగ్ కి వెళ్తుంటే ప్రేమ ఆపి డబ్బు తీసుకొని.. ఇది మా ఆయన ఐడియా.. ఇంకా టీకి కూడా యాడ్ చేసాం..

నువ్వు కూడా టీ తాగావని అన్ని డబ్బులు ప్రేమ తీసుకుంటుంది. ఎంత మోసం అని తిరుపతి అనుకుంటాడు. మరొకవైపు భాగ్యం, ఆనందరావు ఇద్దరు ఒకరికొకరు దెబ్బలకి ఆంటిమెంట్ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One