Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జార్జియా మెలోని.. ప్రపంచ రాజకీయాల్లో ధ్రువతార!

జార్జియా మెలోని.. ప్రపంచ రాజకీయాల్లో ధ్రువతార!

టలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ప్రపంచ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన శక్తిగా ఎదిగారు. తనదైన శైలి, నిక్కచ్చిగా మాట్లాడే తత్వం, నేషన్ ఫస్ట్ అనే మంత్రంతో ఆమె నేడు ప్రపంచ నాయకుల్లో అగ్రగామిగా నిలిచారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం, అంతర్జాతీయ వేదికలపై వారి భేటీలు తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంటాయి. ఈ క్రమంలో.. మెలోని కేవలం ఒక రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా, కష్టాలను అవకాశాలుగా మలుచుకున్న ఒక ధీరోదాత్తమైన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందారు. కష్టాలే మెట్లుగా..

1977లో రోమ్‌లో జన్మించిన మెలోని ప్రస్థానం ఏమాత్రం సులభంగా సాగలేదు. చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లడం, ఆపై ఆయన మాదకద్రవ్యాల కేసులో జైలుకు వెళ్లడం వంటి చేదు సంఘటనలు ఆమెను మానసికంగా బలపడేలా చేశాయి. రోమ్‌లోని గార్బటెల్లా వంటి సామాన్య ప్రాంతంలో పెరగడం ఆమెను ప్రజలకు చేరువ చేసింది. బాల్యంలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఆమె శరీరానికి తీవ్రమైన గాయాలయ్యాయి.

చాలామంది ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచుతారు.. కానీ మెలోని వాటిని ఎప్పుడూ దాచలేదు. తన గాయాలనే ఆమె ఆత్మవిశ్వాసానికి గుర్తులుగా మార్చుకున్నారు. మెలోని వ్యక్తిత్వంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఆమె మొండి పట్టుదల.

నేను ఇలాగే ఉంటాను, ఇలాగే కొనసాగుతాను అనే ఆమె స్పష్టత, ఆమెను రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది. రాజకీయ ప్రస్థానం.. పిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలు 15 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాల వైపు అడుగులు వేసిన మెలోని, 21 ఏళ్లకే రోమ్ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2008లో సిల్వియో బెర్లుస్కోనీ ప్రభుత్వంలో యువజన శాఖ మంత్రిగా పని చేసి, ఇటలీ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన మంత్రిగా రికార్డు సృష్టించారు.

2012లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీని స్థాపించి.. ఎంతో ఓపికతో దానిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. నేను జార్జియా. నేను ఒక స్త్రీని.

నేను ఒక తల్లిని. నేను ఒక క్రైస్తవురాలిని అన్న మెలోనీ నినాదం ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. నాయకత్వ శైలి.. ఆచరణాత్మక జాతీయవాదం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆమె పూర్తిగా తీవ్ర జాతీయవాద వైపు మళ్లుతుందని అందరూ భావించారు.

కానీ, అందుకు భిన్నంగా ఆమె అత్యంత ఆచరణాత్మకమైన నాయకురాలిగా నిరూపించుకున్నారు. నాటో మరియు ఐరోపా సమాఖ్యతో బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే.. వలసల సమస్యపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆమెను విమర్శించే వారు తీవ్ర జాతీయవాదిగా ముద్ర వేసినా..

ఆమె ప్రజాదరణ ఇసుమంతైనా తగ్గలేదు. బహుశా.. ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న నిష్కపట, నిజాయితీ నాయకత్వానికి ఆమె ప్రతిరూపంగా నిలిచారు. వ్యక్తిగత జీవనం..

పరిణితి రాజకీయాల్లో ఎంతటి కఠినంగా ఉంటారో, వ్యక్తిగత జీవితంలోనూ అంతే పరిణితితో వ్యవహరిస్తారు. జర్నలిస్ట్ ఆండ్రియా జియాంబ్రునోతో విడిపోయిన సందర్భంలో, ఆమె చూపిన నిర్లిప్తత, పారదర్శకత ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ సంఘటనను ఆమె సోషల్ మీడియాలో ఏమాత్రం నాటకీయత లేకుండా, నేరుగా ప్రకటించడం ఆమె నిజాయితీకి నిదర్శనం. ఒక స్త్రీగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఆమె సుస్థిరం చేసుకున్నారు.

స్ఫూర్తిదాయక ప్రస్థానం జార్జియా మెలోని ప్రస్థానం కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు, అది నిలకడకు, ధైర్యానికి, అకుంఠిత దీక్షకు నిదర్శనం. తనను తక్కువ అంచనా వేసిన వారికి, తన గతాన్ని విమర్శించిన వారికి పనితీరుతో సమాధానం చెబుతూ ఆమె ముందుకు సాగుతున్నారు. ప్రపంచ రాజకీయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ.. తమ దేశ గౌరవాన్ని కాపాడే నాయకులకు ఆమె ఒక దిక్సూచిలా కనిపిస్తారు.

ఆమె కేవలం ఇటలీ ప్రధానమంత్రి మాత్రమే కాదు, ఆధునిక కాలపు ఒక సాహసోపేత నాయకురాలు జార్జియా మెలోని. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One