Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జన నాయగన్ బాక్సాఫీస్ షాక్ విజయ్ చివరి సినిమాకి ఊహించని నష్టాలు

జన నాయగన్ బాక్సాఫీస్ షాక్ విజయ్ చివరి సినిమాకి ఊహించని నష్టాలు

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం.. అందులోనూ ఆయన కెరీర్ లో చివరి సినిమాగా వచ్చిన 'జన నాయగన్' భారీ డిజాస్టర్ అవ్వడం..

ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు అనౌన్స్ చేసిన ఈ లాస్ట్ ప్రాజెక్ట్‌పై మొదట్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, థియేటర్లలో సీన్ రివర్స్ అయింది.

విడుదలకు ముందే ఈ సినిమా అనేక అడ్డంకులు దాటుకుని వచ్చింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగ్స్ వివాదం, మూవీ లీక్.. ఇలా ఎన్నో రకాల ప్రెజర్ల మధ్య జూలై 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ.78 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ.. నెగెటివ్ టాక్ వల్ల రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన 'జన నాయగన్' మూవీ, ఇప్పటివరకు రూ.300 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. అయితే బడ్జెట్, బిజినెస్ పరంగా చూస్తే భారీ నష్టాలు తప్పేలా లేవు. 'జన నాయగన్' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ, ఇప్పటిదాకా సుమారు రూ.140 కోట్ల షేర్ రాబట్టింది.

ఇక సినిమా రన్ దాదాపు ముగిసినట్లే. దాంతో డిజాస్టర్ గా మిగలనుంది. విజయ్ తన సినీ కెరీర్‌కు ఒక గ్రాండ్ గుడ్ బై చెప్తారని ఆశించిన ఫ్యాన్స్ కు 'జన నాయగన్' ప్లాప్ అవ్వడం నిజంగా పెద్ద షాక్. Jana Nayagan, Box Office, Thalapathy Vijay, Jana Nayakudu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One