Dailyhunt
Jana nayagan జన నాయగన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా పైగా కట్స్ లేకుండానే రాబోతోందా

Jana nayagan జన నాయగన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా పైగా కట్స్ లేకుండానే రాబోతోందా

'అప్పడి పోడు పోడు... అసతి పోడు పోడు కన్నాలే' అనే తన మాస్ సాంగ్ రీతిలోనే ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ఎలక్షన్స్ లో మెజారిటీ సీట్స్ తో దూసుకుపోతున్నాడు.

సిఎం అయ్యే ఛాన్స్ కూడా ఉండటంతో విజయ్ అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. తమిళనాడు మొత్తాన్ని బాణా సంచాలతో మోత మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన నాయగాన్ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

జన నాయగాన్ రిలీజ్ కి సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో పొంగల్ కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదాపడిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం గాని అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకునే కింగ్ మేకర్ గా నిలబడటం ఖాయమని తెలుస్తుంది. దీంతో వారం రోజుల్లోనే జన నాయగన్ థియేటర్స్ లోకి రాబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొసమెరుపు ఏంటంటే ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండానే రిలీజ్ కాబోతుందనే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది.

అధికారం అనేది గాడ్ కంటే పవర్ ఫుల్ అనే విషయం తెలిసిందే. Also read: Peddi vs jailer 2: వామ్మో మరి అంత రేటా.. వర్క్ అవుట్ అవుతుందా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One