Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jana Nayagan జననాయగన్ తెలుగు బిజినెస్ క్రేజ్ సీఎం రేంజ్ లెక్కలివే

Jana Nayagan జననాయగన్ తెలుగు బిజినెస్ క్రేజ్ సీఎం రేంజ్ లెక్కలివే

ళయ దళపతి విజయ్(Vijay)చివరి మూవీ 'జననాయగన్'(Jana Nayagan)రాక కోసం ఎదురుచూడని అభిమాని, ప్రేక్షకుడు లేడు. పైగా ఇప్పుడు విజయ్ సిఎం కూడా కావడంతో జననాయగన్ కి సరికొత్త క్రేజ్ ఏర్పడింది.

తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో తెలుగుకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నిర్మాతలు తెలుగు హక్కులని 35 కోట్లు చెప్తుండగా మన బయ్యర్లు మాత్రం 20 కోట్లు ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ మార్కెట్ గత కొన్ని ఏళ్లుగా సినిమా సినిమాకి పెరుగుతూ వస్తుంది. 'లియో', 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రాలు తెలుగులో మంచి వసూళ్లు సాధించడంతో 'జననాయగన్' తెలుగు థియేట్రికల్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైట్స్ కోసం అయితే బయ్యర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. బాబీ డియోల్ విలన్‌గా చేస్తుండటం, పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా ఉండటం, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం జననా యగాన్ కి తెలుగులో మరింత క్రేజ్ ఏర్పడింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ వన్ మాన్ షో 'భగవంత్ కేసరి'కి రీమేక్‌ అనే టాక్ అయితే యధావిధిగా తన హవాని కొనసాగిస్తూ వస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One