Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Janaki ramudu పంచాయతీలో అల్లుడికి షాక్ ఇచ్చిన అత్త

Janaki ramudu పంచాయతీలో అల్లుడికి షాక్ ఇచ్చిన అత్త

పునర్జన్మల నేపథ్యంతో వచ్చిన అరుదైన దృశ్యకావ్యాల్లో 'జానకిరాముడు' కి ప్రత్యేక స్థానం ఉంటుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, యువచిత్ర ఆర్ట్స్ పై అభిరుచిగల నిర్మాత కె .మురారి నిర్మించగా 1988 ఆగస్టు 19న విడుదలై ఘనవిజయం సాధించింది.

కింగ్ అక్కినేని నాగార్జున, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా చేయగా, కథని మలుపు తెప్పే మరో కీ రోల్ లో జీవితా రాజశేఖర్ కనిపించింది. నటీనటులందరూ పోటాపోటీగా నటించడం ఈ చిత్రం స్పెషాలిటీ. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ సాగే ఎమోషనల్ సీన్లు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇక పైన ఉన్న వీడియోలో సన్నివేశాన్ని చూస్తే రంగడు(నాగార్జున), లక్ష్మి (విజయశాంతి) ప్రేమించుకుంటారు.తల్లి తండ్రుల సమక్షంలో నిచ్చితార్ధం ఏర్పాటు చేసి పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు.

కానీ లక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి అయిందని బావ బలవంతరావు(మోహన్ బాబు) అతని తల్లి సాక్షాలతో సహా నిరూపిస్తారు. పంచాయితీలో పెట్టినా కూడా లక్ష్మి, బలవంతరావు భార్య భర్తలని అంటారు. దీంతో రంగడు, లక్ష్మి ల పెళ్ళికి అడ్డుకట్ట పడుతుంది. లక్ష్మి తండ్రికి పక్షవాతం రావడంతో లక్మి కూడా బలవంతరావు గీసిన గీత దాటి వెళ్లలేకపోతుంది.

ఈ సన్నివేశంలో నటీనటుల నటన, డైలాగ్స్, దర్శకత్వం సూపర్ గా ఉంటాయి కె. వి. మహదేవన్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ చిత్రానికి కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, నంది అవార్డుని గెలుచుకుంది. సినిమా విడుదలైన ఈ 38 ఏళ్ల కాలంలో ఎన్నో ప్రేమకథలు వచ్చినా, జానకిరాముడు చిత్రంలోని ఎమోషనల్ సీన్స్, నటన ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One