Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jayam Ravi జయం రవి నిజస్వరూపం ఇదే  మీరాచోప్రా సంచలన ట్వీట్

Jayam Ravi జయం రవి నిజస్వరూపం ఇదే మీరాచోప్రా సంచలన ట్వీట్

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బంగారం మూవీలో చేయడం ద్వారా అభిమానులు, ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని పొందిన భామ మీరాచోప్రా. ప్రస్తుతం జయం రవి, భార్య ఆర్తి, శ్రేయోభిలాషి కేనీషా ఫ్రాన్సిస్ మధ్య జరుగుతున్న మినీ యుద్ధంపై మీరాచోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది..

ఎక్స్ వేదికగా స్పందిస్తు జయం రవి నాకు చాలా బాగా తెలుసు. అతను ఎంతో సున్నితమైన, మంచి వ్యక్తి. ప్రతిసారీ తప్పు మగవాడిదే కానక్కర్లేదు. ఈ రోజుల్లో కొంతమంది మహిళలు తమకి అనుకూలంగా ఉన్న చట్టాలని, వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు.

సమాజం ఎప్పుడూ ఒక పక్షాన్నే వినకూడదు, మగవారి వెర్షన్‌ కూడా ప్రపంచం వినాలి. రవి పడుతున్న బాధను చూస్తుంటే బాధగా ఉంది. అతనికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నిజం గెలుస్తుందని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ లో పేర్కొంది. Also read: Ram Pothineni: రామ్ పోతినేని డైరెక్షన్ లో విలన్ గా స్టార్ హీరో.. RAPO23 కి అదిరిపోయే క్రేజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One