జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -269 లో.. ధీరజ్ కి విశ్వ పనిష్ మెంట్ ఇస్తాడు. ఈ మధ్య నీకు డిసిప్లెన్ లేకుండాపోయింది.
అందుకే నీకు ఈ పనిష్ మెంట్ అని ధీరజ్ ని మోకాళ్ళ మీద నిల్చోబెడతాడు విశ్వ. ఇంకోసారి డిసిప్లెన్ లేకుండా ఉంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొడతానని విశ్వ అంటాడు. ఇక విశ్వ వెళ్ళాక ధీరజ్ ఫ్రెండ్స్ వస్తారు. ఏంట్రా ఇలా ఉన్నావని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగగా మా కోచ్ నా కాళ్ళు చేతులు విరగ్గొడతానని వార్నింగ్ ఇచ్చాడురా..
మీరు నాకు ఒక హెల్ప్ చేయాలిరా.. అతని కాళ్ళు చేతులు విరగ్రొట్టండి.. బెడ్ మీద పడి ఉంటాడు పాపం ముసలోడు అని ధీరజ్ అంటాడు. మరోవైపు రుద్ర ఒంటరిగా ఉంటాడు.
అప్పుడే అతని దగ్గరకి వీరు వస్తాడు. ఏంటి బావ.. సూర్య అలా ఎదురుతిరిగి మాట్లాడాడు.. ఒక పౌరుషంతో..
ఒక బాధతో.. ఒక తెగింపుతో అలా మాట్లాడేంటి బావ.. ఒక్కడు ఎదురుతిరిగితేనే ఇలా ఉంది.. ఇంకా మీ కుటుంబం అంతా ఇలానే ఎదురుతిరిగితే నీ పరిస్థితి ఏంటని వీరు అంటాడు.
దానికి రుద్ర సైలెంట్ గా ఉంటాడు. మీరు ధైర్యంగా నిలబడాలి బావ.. ఇంకా ఇలాంటివి చాలా వస్తాయని వీరు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడతాడు. అదంతా గంగ, రంగా దూరం నుండి ఉంటారు.
ఇక వీరుకి బుద్ధి చెప్పాలని అనుకుంటారు. మరోవైపు ప్రమీల కోసం కార్తీక్ ఎదురుచూస్తుంటాడు. ఇక అతని దగ్గరికి మక్కం వచ్చి.. ఎవరికోసం చూస్తున్నారని అంటాడు.
ప్రమీల మేడమ్ ఇంకా రాలేదని చూస్తున్నానని కార్తీక్ అనగానే ఇతనేంటి ఇంత డైరెక్ట్ అయిపోయాడు.. అడిగితే ఫీల్ అవుతాడేమోనని మక్కం అనుకుంటాడు. అప్పుడే ప్రమీల వస్తుంది. వచ్చీ రాగానే సూపర్ మార్కెట్ లో పనిచేసే స్టాఫ్ ని తిడుతుంది.
ఇక కార్తీక్ వెళ్ళి ప్రమీలని కూల్ చేస్తాడు. మీరు ఇంటి దగ్గరి కోపాన్ని ఇక్కడ చూపించకండి కామ్ అవ్వండి అని కార్తీక్ చెప్పడంతో ప్రమీల నార్మల్ అవుతుంది. మరోవైపు గంగ, రంగా కలిసి వీరుని ఓ ఆట ఆడుకుంటారు. మెట్లకు అడ్డంగా ఒక సన్నని తాడు కట్టి వీరుని అక్కడికి రప్పించి అతను కిందపడిపోయేలా చేస్తారు గంగ, రంగా.
ఇక మరో తాడుని గుమ్మంకి అడ్డుగా కట్టి ఉంచుతుంది గంగ. అదే సమయంలో రుద్ర కార్ దిగి ఇంట్లోకి వస్తుంటాడు. వీరు తొందరగా మెట్లు దిగి వస్తుంటే ఫోన్ వస్తుందంటూ ప్రీతీ ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది. వీరు ఫోన్ మాట్లాడుతుంటే రుద్ర గుమ్మం దగ్గరికి వచ్చేస్తాడు.
ఇక తాడుకి తగిలి రుద్ర ఎక్కడ పడిపోతాడేమోనని రంగా ఫాస్ట్ గా పరుగెత్తుకుంటూ వెళ్ళి రుద్రని హత్తుకుంటాడు. నిన్ను బాగా మిస్ అయ్యాను బావ అని అంటూ టైమ్ పాస్ చేస్తాడు. అదే సమయంలో వీరు ఫోన్ కాల్ వినపడటం లేదని బయటకు వస్తూ ఆ తాడు తగిలి సరిగ్గా రుద్ర కాళ్ళ దగ్గర పడతాడు. చూస్కోవాలి కదా అన్నయ్య మళ్ళీ పడ్డావా అంటూ గంగ ఎంట్రీ ఇస్తుంది.
ముందు ఏముందో చూస్కోవాలి కదా అన్నయ్య లేదంటే ఇలాగే జారి పడిపోతావని గంగ అంటుంది. ఇక రుద్రకి వాళ్ళ మీద డౌట్ వస్తుంది. అప్పుడే అక్కడికి శకుంతల, పెద్దసారు వస్తారు. అయ్యో వీరు మళ్ళీ పడిపోయావా అంటూ అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

