Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జోగిపై వేటుకు జగన్ రెడీ.!

జోగిపై వేటుకు జగన్ రెడీ.!

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ పై వైసీపీ వేటేయనుందా? వైసీపీ అధినేత జగన్ జోగి రమేష్ పై అసంతృప్తిగా ఉన్నారా? సీనియర్ నాయకుడై ఉండి కూడా కుటుంబ తగాదా రచ్చ కెక్కకుండా చూసుకోవడంతో విఫలమై జోగి రమేష్ పార్టీ ప్రతిష్ఠను మసకబార్చారని జగన్ భావిస్తున్నారా అంటు వైసీపీ వర్గాలతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా ఔననే అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్‌ కుటుంబంలో ఇటీవల తలెత్తిన విభేదాలు.. రచ్చకెక్కాయి. ఆయన కోడలు మేఘన అదనపు కట్నం కోసం మెట్టినింటి వారు (జోగి రమేష్ కుటుంబ సభ్యులుఊ వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. జోగి రమేష్ పై జగన్ ఆగ్రహంగాఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు సూర్యాపేటకు చెందిన వ్యాపారవేత్త అనంత కృష్ణ గౌడ్ కుమార్తె మేఘనతో గత ఏడాది మేలో వివాహం జరిగింది. ఈ వివాహం సందర్భంగా తన తల్లిదండ్రులు దాదాపు 5 కోట్లు ఖర్చు చేశారనీ, అదనంగా కట్నకానుకల రూపంలో భారీగా బంగారం, వెండి అందజేశారని మేఘన తెలిపారు. అయితే వివాహమైన నెలల వ్యవధిలోనే తనకు వేధింపులు మొదలయ్యాని మేఘన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దంపతుల మధ్య వ్యక్తిగత కారణాల వల్ల విభేదాలు తలెత్తాయని, ఇరు వర్గాలు సమష్టిగా సమస్యను పరిష్కరించుకోలేక కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చిందని జోగి రమేష్ చెబుతోంది.

అయితే ఈ వివాదం వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల హస్తం ఉందని, తమ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపణలు చేశారు. ఇరు వర్గాల మధ్య జరిగిన పంచాయితీల వివరాలు, ఆడియో-వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పార్టీ సీనియర్ నేత కుటుంబ వ్యవహారం ఇలా బహిరంగంగా రచ్చకెక్కడం వైసీపీని ఇరకాటంలో పడేసింది. జోగి కుటుంబ వివాదం నిత్యం వార్తలు రావడం, కుటుంబ వివాదంలో జోగి రమేష్ ప్రత్యర్థి పార్టీ నేతల హస్తం అంటూ ఆరోపణలు గుప్పించడం వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపిందని జగన్ భావిస్తున్నారు. కుటుంబ పంచాయతీ రచ్చకెక్కకుండా పరిష్కరించుకోవడంలో జోగి విఫలమై పార్టీ ఇమేజ్ ను ఫణంగా పెట్టి బయటపడాలని భావిస్తున్నారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో పార్టీ ఆమేజ్ దెబ్బతిందనీ, జోగి రమేష్ పై వేటు వేయడం ద్వారా నష్టాన్ని పూడ్చుకోవాలనీ జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. Jagan Angry On Jogi Ramesh, YCP Jagan, Jogi Rajeev Meghana Issue, AP Politics, Telugu One

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One