Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ అండ్ రేప్ కేసులో..వెలుగులోకి విస్తుపోయే విషయాలు

జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ అండ్ రేప్ కేసులో..వెలుగులోకి విస్తుపోయే విషయాలు

హైదరాబాదు జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికల ట్రాప్ అండ్ రేప్ చీటింగ్ కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు జిల్లాకు చెందిన అర్జున్ అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్, రాజీవ్ జూబ్లీహిల్స్ లోని బడా బాబుల కూతుర్లను టార్గెట్ గా చేసుకొని వారిని ట్రాప్ చేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ అన్నదమ్ములిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

అయితే ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి మొత్తం 19 మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ దాదాపు మూడు గంటల పాటు నిందితులను స్వయంగా విచారించారు. ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు. మైనర్ బాలికలు తనకు అట్రాక్ట్ అయ్యేలా అర్జున్ ఇంస్టా గ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేసేవాడు.

అలా మొదట గా స్నేహంగా ప్రారంభమై.. చాటింగ్ తర్వాత నెమ్మదిగా వ్యక్తిగత పరిచయాలు పెంచుకుంటూ వలలోకి దింపారు. ఖరీదైన కార్లలో డ్రైవ్స్, లైఫ్ స్టైల్ చూపిస్తూ నమ్మకం పెంచుకున్నారు. ఇలా అర్జున్ ఇంస్టాగ్రామ్ ను మొత్తం 150 మంది బాలి కలు ఫాలో అవుతున్నారు.

అంతటితో ఆగలేదండోయ్ ఈ ఇద్దరు అన్నదమ్ములు లగ్జరీ కార్లలో తిప్పుతూ తమతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవా లంటూ ఒత్తిడి చేసేవారు. కొన్ని సందర్భా ల్లో మైనర్ బాలికలతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు కూడా రికార్డు చేశారు. తాము త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని అందుకు కొంత డబ్బులు అవసరం ఉన్నాయంటూ మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. అలా ఒక మైనర్ బాలిక నుండి 13 లక్షల రూపా యలు వసూలు చేశారు.

మైనర్ బాలిక ఇంట్లో ఈ వ్యవహారం తెలియ డంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములకు తల్లి మీనా కుమారి సహకరి స్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా అర్జున్ ఓ మైనను బాలికను ట్రాక్ చేసిన కేసులో మూడు రోజుల పాటు జైలుకు వెళ్లి తిరిగి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ అటువంటి మోసాలకే పాల్పడుతున్న ట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం అర్జున్ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లాక్ చేసి. దర్యాప్తు ముమ్మరం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One