Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కావ్య హగ్గు కోసం 903 కొట్టిన ఇమ్ము శ్రీముఖి హగ్ కోసం 840 కొట్టిన బాలు

కావ్య హగ్గు కోసం 903 కొట్టిన ఇమ్ము శ్రీముఖి హగ్ కోసం 840 కొట్టిన బాలు

మా బోనాల జాతర లేటెస్ట్ ప్రోమో ఫుల్ నవ్వులు, అరుపులు, కేకలతో దడ పుట్టిస్తోంది. ఈ ఎపిసోడ్ కి "గోల్కొండ పెహెల్వాన్స్, హైదరాబాద్ దగడ్స్ , సికింద్రాబాద్ షేర్ " పేరుతో బుల్లితెర మీద కనిపించేవాళ్లంతా టీమ్స్ గా వచ్చారు.

"ఈ జాతరలో పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది "అని చెప్పింది శ్రీముఖి. "ఈరోజు ఈవెంట్ ఏమైనా పర్వాలేదు బావను బాగా చూసుకోవాలి " అంటూ ఇమ్ముకు చెప్పింది శ్రీముఖి. "బావంటే నటరాజ్ బావే కదా " అన్నాడు . దాంతో శ్రీముఖి ఏయ్ అని అరిచింది.

ఇక నటరాజ్ మాష్టర్ తెగ నవ్వుకున్నాడు. "బావకు నేనేమీ తక్కువ చెయ్యట్లేదు ." అన్నాడు ఇమ్ము. "ఏ " అంది శ్రీముఖి. ఎందుకంటే ఇందాకే బావ ఏది అడిగితే అది ఇచ్చా " అన్నాడు.

" ఎం అడిగాడు " అంది శ్రీముఖి. "ఎల్లో టీమ్ లో ఒక అమ్మాయి నంబర్ అడిగాడు ఇచ్చేసా" అని చెప్పాడు ఇమ్ము. దాంతో శ్రీముఖి కూడా నవ్వేసింది. బావ ఎవరో కాదు బాలు.

"మీ మీ టీమ్స్ గురించి డైలాగులు వదిలితే అవతలి టీమ్ లు భయపడాలి బిడ్డా " అంది శ్రీముఖి. "చేతికి పెట్టుకుంటారు ఉంగరాలు. మా గోల్కొండ వాళ్ళు జరిపిస్తే అదిరిపోతాయి బోనాల సంబరాలు " అని మంచి జోష్ తో చెప్పింది ప్రియాంక జైన్. ఇక సంజనా గల్రాని "లైబ్రరీ లో ఉంటాయి పుస్తాకాలు " అని చెప్పింది.

కానీ ఇంకో లైన్ డైలాగ్ ని అవినాష్ కి పేపర్ మీద రాసి ఇచ్చినా చెప్పలేకపోయాడు. ఇక స్టేజి మీద ఒక పవర్ పంచింగ్ మెషీన్ ని పెట్టారు. దాన్ని ఎంత గట్టిగా కర్రతో కొడితే అది కౌంట్ చూపిస్తుంది. ముందుగా బాలు దాన్ని గట్టిగ బలం అంతా ఉపయోగించి కొట్టాడు.

కౌంట్ 840 అంటూ శ్రీముఖి గట్టిగ అరిచింది. "బాలు నేను చాలా ఇంప్రెస్స్ ఐపోయాను " అంటూ శ్రీముఖి గట్టిగా ఒక హగ్ ఇచ్చేసింది అడగకుండానే. తర్వాత ఇమ్ము వంతు వచ్చింది. "నేను ఈ గేమ్ ఆడాలంటే నాకు కావ్య హగ్ కావాలి" అంటూ కండిషన్ పెట్టాడు.

వెంటనే కావ్య "ఇది గెలిస్తే నేనే హగ్ ఇస్తాను " అని చెప్పింది కావ్య. వెంటనే ఇమ్ము ఆ రాడ్ తీసుకుని మెషిన్ గట్టిగా కొట్టాడు. ఇక కౌంట్ 903 వచ్చింది. వెంటనే శ్రీముఖి గట్టిగా అరుపులు కేకలతో స్టేజి మొత్తం గంతులేసింది.

ఇమ్ము కొట్టాడు పరిగెత్తాడు. "కేవలం కావ్య హగ్ కోసం 903 కొట్టాడు " అంటూ శ్రీముఖి చెప్పింది. ఇమ్ము చేతులు బార్లా చాచి నిలబడ్డాడు. వెంటనే కావ్య ఫ్రెండ్ కాబట్టి హగ్ ఇస్తాను అంటూ వెళ్లి హగ్ చేసుకుంది . వెంటనే ఇమ్ము "ఇపొయిందిరా నా ఈవెంట్ ఐపోయింది" అని చెప్పేసాడు. ఇక ఈ ఎపిసోడ్ ఈ నెల 9 వ తేదీ రాత్రి 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. -------------

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One