Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
kara కర ఓటిటి డేట్ ఇదే ధనుష్ ఫ్యాన్స్ చెయ్యాల్సింది ఇదే

kara కర ఓటిటి డేట్ ఇదే ధనుష్ ఫ్యాన్స్ చెయ్యాల్సింది ఇదే

విభిన్న చిత్రాల స్టార్ హీరో ధనుష్(Dhanush)గత నెల ఏప్రిల్ 30 న 'కర' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రూరల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనని సొంతం చేసుకుంది.

తమిళనాట కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకి సొంతం చేసుకుంది. మే 28 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా సదరు సంస్థ అధికారకంగా వెల్లడి చేసింది. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఈ ప్రకటనతో ఓటిటి ప్రియుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొని ఉంటుందని చెప్పవచ్చు ధనుష్ సరసన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు(Mamitha Bhaiju)హీరోయిన్‌గా చెయ్యగా జయరామ్, కె.ఎస్.

రవికుమార్, కరుణాస్ కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, థేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథ విషయానికొస్తే..

1990ల నాటి గల్ఫ్ వార్ నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒకప్పుడు దొంగతనాలకు దూరంగా ఉండి భార్యతో కలిసి రేణిగుంటలో సాధారణ హోటల్ నడుపుకుంటూ బతికే కరసామి అనే వ్యక్తి, తన కుటుంబానికి, పూర్వీకుల భూమికి బ్యాంకుల వల్ల ముప్పు రావడంతో మళ్లీ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, గ్రామీణ నేపథ్యంలో వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ థ్రిల్ కి గురి చేస్తాయి. Also read: sravanthi Chokarapu: యాంకర్ స్రవంతి షాకింగ్ కామెంట్స్.. పెళ్లి అయిందని ఆ స్టార్ మూవీలో తప్పించారు సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం తమిళనాడులో ఉన్న రాజకీయ వాతావరణం, ఎలక్షన్ సీజన్ ప్రభావం 'కర' టాక్ , కలెక్షన్స్ పై పడ్డాయనేది అంచనా.

వరల్డ్ వైడ్ గా 43.14 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. 'పోర్ తోళిల్' వంటి మైండ్‌ బ్లోయింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ విఘ్నేశ్ రాజా(Vignesh Raja) 'కర'ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. తమిళనాట ఏప్రిల్ 23 న ఎన్నికలు జరగగా మే 4 న రిజల్ట్ వచ్చిన విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One